DaggubatiAbhiram: 'అహింస' విడుదల ఎప్పుడో తెలుసా
ABN , First Publish Date - 2023-02-07T12:40:25+05:30 IST
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు (Daggubati Suresh Babu) రెండో తనయుడు అభిరాం (Abhiram debut) ఆరంగేట్రం చేస్తున్న సినిమా 'అహింస' (Ahimsa) విడుదల వాయిదా పడుతూనే వుంది
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు (Daggubati Suresh Babu) రెండో తనయుడు అభిరాం (Abhiram debut) ఆరంగేట్రం చేస్తున్న సినిమా 'అహింస' (Ahimsa) విడుదల వాయిదా పడుతూనే వుంది. ఈ సినిమాకి తేజ (Director Teja) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది, (#Ahimsa) పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసేసారు, కానీ విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. "ఇప్పుడు విడుదల చెయ్యడానికి మంచి టైం కాదు, ఎందుకంటే ప్రేక్షకులు థియేటర్ కి రావటం లేదు, దానికి తోడు చాలా పెద్ద సినిమాలు చాల వున్నాయి. వాటి మధ్యలో ఈ సినిమా ఎందుకని, సమ్మర్ లో విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు," అని చిత్ర యూనిట్ సభ్యుడు ఒకరు చెప్పారు. (#DaggubatiAbhiram)
దగ్గుబాటి అభిరాం ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయం అవుతున్నాడు. ఒక కొత్త నటుడుని పరిచయం చెయ్యడానికి సరిపడా విషయం ఈ సినిమా కథలో ఉందని, అభిరాం తన పాత్రని బాగా చేసాడని కూడా చెపుతున్నారు. అభిరాం తండ్రి సురేష్ బాబు సినిమా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారని కూడా తెలిసింది. టైటిల్ చెప్పినట్టుగా అహింస మార్గం లో వున్న ఒక యువకుడు ఎందుకు హింస వేపు దృష్టి మరల్చాడు అన్న నేపధ్యం లో వచ్చిన సినిమా. "ఇది అన్ని హంగులు వున్న ఒక పూర్తి కమర్షియల్ సినిమా. అటువంటి సినిమాకి కావలసిన హంగులు అన్నీ ఇందులో వున్నాయి, నేను సినిమా చూసా, మా అబ్బాయి బాగా చేసాడు," అని చెప్పారు సురేష్ బాబు. దర్శకుడు తేజ అభిరాం తో పారు ఈ సినిమాలో ఇంకా చాలామంది నటీనటులను, సాంకేంతిక నిపుణలని పరిచయం చేస్తున్నారు.