D Sureshbabu: ట్రాఫిక్ పోలీస్ డి.సురేశ్‌బాబు!
ABN , First Publish Date - 2023-01-03T19:15:24+05:30 IST
హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే! రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీస్ లేకపోతే నరకమే! అడ్డదిడ్డాలుగా డ్రైవ్ చేస్తూనే ‘ఒక్కడికీ ట్రాఫిక్ సెన్స్ లేదు’ అంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ వెళ్తుంటారు.
హైదరాబాద్ సిటీలో(Hydrabad traffic) ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే! రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీస్ లేకపోతే నరకమే! అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తూనే ‘ఒక్కడికీ ట్రాఫిక్ సెన్స్ లేదు’ అంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ వెళ్తుంటారు. అసలు విషయానికొస్తే.. ఎప్పుడూ రద్దీగా ఉండే ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో సోమవారం ట్రాఫిక్ మరింతగా జామ్ అయింది. ఈ ట్రాఫిక్‌లో నిర్మాత సురేశ్‌బాబు (D suresh babu) కూడా చిక్కుకుపోయారు. ఎంతకీ ట్రాఫిక్ కదలకపోవడంతో.. ఆయన కారు దిగి.. కాసేపు ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తారు. జామ్ అయిన ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు.
అడ్డదిడ్డంగా వచ్చిన వాహనదారులను ఆయన కంట్రోల్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయనకు సాయంగా ఓ ఇద్దరు జత కలిశారు. పది నిమిషాల్లో ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేశారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు సురేశ్ బాబుని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం సినిమా మార్కెట్ దృష్ట్యా ఆయన సినిమా నిర్మాణంలో కాస్త స్లోగా ఉన్నారు. ఈ ఏడాది చిన్న, పెద్ద చిత్రాలపై దృష్టి సారిస్తునట్లు ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.