Custody Twitter Review: కస్టడీ ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2023-05-12T09:27:20+05:30 IST

నాగచైతన్య(Naga chaitanya), కృతీ శెట్టి (Krithishetty) హీరో హీరోయిన్లుగా తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కిన చిత్రం ‘కస్టడీ’(Custody). సరోజ, ‘మానాడు’ , గోవా వంటి చిత్రాలతో ఆకట్టుకున్న కోలీవుడ్‌ దర్శకుడు వెంకట ప్రభు (Venkay prabhu movie)ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Custody Twitter Review: కస్టడీ ఎలా ఉందంటే..

నాగచైతన్య(Naga chaitanya), కృతీ శెట్టి (Krithishetty) హీరో హీరోయిన్లుగా తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కిన చిత్రం ‘కస్టడీ’(Custody). సరోజ, ‘మానాడు’ , గోవా వంటి చిత్రాలతో ఆకట్టుకున్న కోలీవుడ్‌ దర్శకుడు వెంకట ప్రభు (Venkay prabhu movie)ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అంచనాలు పెరిగాయి. నాగచైతన్య, కృతీశెట్టి రెండోసారి కలిసి నటించారు. ఈ చిత్రంలో నాగచైతన్య పోలీస్‌ కానిస్టేబుల్‌గా నటించారు. సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న చైతూ ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఏమేరకు విజయ సాధిస్తుంది? థియేటర్‌లో బొమ్మ పడగానే ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారో చూద్దాం. (Custody Twitter review)

5.jpg

147 నిమిషాల చిత్రమిది. మొరంపూడి అనే గ్రామంలో ఓ యాక్సిడెంట్‌తో సినిమా మొదలైంది. నాగచైతన్య ఎంట్రీ కూల్‌గా బావుందని నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు. అయితే సినిమా ప్రారంభమైన అరగంటలో మెయిన్‌ లీడ్స్‌ మఽధ్య సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ కాస్త రిజల్ట్‌ మిశ్రమంగా ఉంటుందేమో అన్న పోస్ట్‌లు వచ్చాయి. నటన పరంగా నాగచైతన్య, అరవింద స్వామి ఇరగదీశారని చెబుతున్నారు. అయితే కథ, కథనం నడిచిన తీరులో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవని చెబుతున్నారు. ఇంటర్వెల్‌ వరకు కథ సాదాసీదాగా ఉందని, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ పర్వాలేదని అంటున్నారు. ఫస్టాఫ్‌ ఆసక్తిగా సాగిందని ఇంకాస్త గ్రిపింగ్‌గా ఉంటే మరింత ఇంట్రెస్ట్‌ కలిగేదని, కొందరు అయితే ఫస్టాఫ్‌ సూపర్‌ అని, మంచి థ్రిల్లర్‌ చూస్తున్న ఫీల్‌ కలుగుతుందని చెబుతున్నారు. యాక్షన్‌ సన్నివేశాలు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఆకుట్టకునేలా ఉన్నాయని పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే సినిమా హిట్‌ అయ్యే అవకాశం 50-50 ఉందని పలువురు కామెంట్‌ చేస్తున్నారు.

ఫస్టాఫ్‌లో పోలీస్‌ స్టేషన్‌ సీన్‌, సెకెండాఫ్‌లో ఫారెస్ట్‌ సీన్‌ అదిరిందని ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేశాడు. ఓవరాల్‌గా బ్లాక్‌బస్టర్‌ హిట్టని ఓ నెటిజన్‌ రివ్యూ ఇచ్చేశాడు.

Updated Date - 2023-05-12T09:40:05+05:30 IST