Skn: ‘కల్ట్ బొమ్మ’ ఎవరో.. టైటిల్ రిజిస్టర్ చేయించిన బేబీ నిర్మాత
ABN , First Publish Date - 2023-12-11T16:07:34+05:30 IST
బేబి సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నిర్మాత ఎస్ కేెఎన్ (శ్రీనివాస కుమార్)(SKN) . ఈ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో వరుసబెట్టి సినిమాలను ప్రకటించి ప్రారంభించాడు. అయితే నిర్మాత తాజాగా కల్ట్ బొమ్మ అనే సినిమా టైటిల్ ను రిజిస్టర్ చేయడం ఆసక్తికరంగా మారింది.
బేబి (Baby The Movie) సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నిర్మాత ఎస్ కేెఎన్ (శ్రీనివాస కుమార్)(SKN ). ఈ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు సాయి రాజేశ్ (Sai Rajesh) తో కలిసి మాస్ మావీ మేకర్స్ బ్యానర్ పై వరుసబెట్టి సినిమాలను ప్రకటించి ప్రారంభించాడు. అందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్న గర్ల్ ప్రెండ్ సినిమా కూడా ఉండగా త్వరలో బేబీ సినిమాను ప్రముఖ బాలీవుడ్ స్టార్ కుమారుడితో రిమేక్ చేయనున్నారు.
అయితే నిర్మాత SKN తాజాగా కల్ట్ బొమ్మ అనే సినిమా టైటిల్ ను రిజిస్టర్ చేయడం ఆసక్తికరంగా మారింది. బేబీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత కల్ట్ బొమ్మ అంటూ పదేపదే సంబోధించడంతో ఆ పదం మొదటిసారిగా బాగా వైరల్ అయింది. అదే క్రమంలో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా అదే పేరును ప్రస్తావిస్తూ రావడంతో కల్ట్ బొమ్మ అనే పేరు సోషల్ మీడియాలో కొంతకాలం ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పుడు ఆదే పేరును సినిమా టైటిల్ గా రిజిస్టర్ చేయడంతో సర్వత్రా ఆ సక్తికరంగా మారింది.
ఇదిలాఉండగా ఇటీవలే మాస్ మైవీ మేకర్స్ బ్యానర్ పై ఆనంద్ దేవరకొండ (anand devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా ఓ మూవీ, సంతోష్ శోభన్, బిగ్ బాస్ ఫేం ఆలేఖ్యా హరిక జంటగా ఓ సినిమాను తెరకెక్కిస్తుండడగా ఇప్పుడు రిజిస్టర్ చేయించిన పేరును వాటిలో దేనికైనా పెడతారా లేక కొత్తగా మరో సినిమా ఏమైనా ఫ్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.