WashingtonSundar: పడ్డాడండీ ప్రేమలో మరి, ఈ యువ క్రికెట్ ప్లేయర్ ఈ తెలుగు నటితో ప్రేమలో పడ్డాడా...

ABN , First Publish Date - 2023-05-23T18:40:17+05:30 IST

తమిళనాడుకి చెందిన యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ ప్రేమలో పడ్డాడు అని నెటిజన్స్ అంటున్నారు. ఇంతకీ అతను ప్రేమలో పడింది ఒక తెలుగు యాంకర్, నటి తో అని అంటున్నారు. ఎందుకంటే ఆ నటి ఒక ఫోటో పోస్ట్ చేస్తే, కిందని నెటిజన్స్ చాలామంది వాషింగ్టన్ సుందర్ గురించే మాట్లాడుతున్నారు. ఇంతకీ వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారా లేదా, వాళ్ళే చెప్పాలి.

WashingtonSundar: పడ్డాడండీ ప్రేమలో మరి, ఈ యువ క్రికెట్ ప్లేయర్ ఈ తెలుగు నటితో ప్రేమలో పడ్డాడా...
Washington Sundar

క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ (WashingtonSundar) పేరు అందరికీ సుపరిచితమే, భారత క్రికెట్ జట్టు తరపున ఆడాడు, అలాగే ఇప్పుడు ఐపీల్ (IPL) లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SunrisersHyderabad) జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈ యువ క్రికెటర్ ఇప్పుడు ఒక తెలుగు సినిమా నటి తో ప్రేమలో వున్నాడా అని నెటిజన్స్ అందరూ కామెంట్ చేస్తున్నారు. ఆ నటి పోనీ ఎదో అగ్ర తారల్లో వున్న నటి కూడా కాదు, ఇంతకు ముందు యాంకరింగ్ చేసి, ఇప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో పోషిస్తోంది. ఈమధ్య విడుదలైన సమంత (Samantha) నటించిన 'శాకుంతలం' (Shaakuntalam) సినిమాలో కనిపించింది ఆమె ఎవరో కాదు వర్షిణి (VarshiniSounderajan). ఈమె తెలుగులో చిన్నతెర, పెద్దతెర మీద కనిపిస్తున్నా ఈమె పూర్తి పేరు మాత్రం వర్షిణి సౌందర్ రాజన్ #VarshiniSounderajan. కొంచెం తమిళ మూలాలు వున్నాయి ఈమెకి కూడా, అక్కడ ఈ ఇద్దరూ కలిసారేమో మరి.

varshini1.jpg

ఎందుకంటే వర్షిణి, హైదరాబాద్ ఐపీల్ మ్యాచ్ లు ఉప్పల్ స్టేడియం (UppalStadium) లో జరిగినప్పుడల్లా వెళుతూ ఉండేది. ఎదో ఒక పిక్ పోస్ట్ చేస్తూ ఉండేది. అయితే కిందన కామెంట్స్ మాత్రం వాషింగ్టన్ సుందర్ గురించే ఎక్కువ వున్నాయి. దానికి ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వకపోయినా అది ఎప్పుడూ ఆమె అలాంటిది లేదు అని మాత్రం చెప్పలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈమె వెళ్ళినప్పుడల్లా హైదరాబాద్ గెలవలేదుట. అయితే దానికి ఆమెని ఏమీ అనలేము కదా, అది యాదృచ్ఛికం, అంతే !

varshini.jpg

ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే, వాషింగ్టన్ సుందర్, #WashingtonSundar వర్షిణి కన్నా చాలా చిన్నవాడు, సుమారు ఒక అయిదారు సంవత్సరాల చిన్నవాడు. మరి అదెలా కుదురుతుంది అంటే, దానికి సచిన్ టెండూల్కర్ (SachinTendulkar), అతని భార్య అంజలిని (Anjali) ఉదాహరణగా చెప్తున్నారు నెటిజన్లు. ఇంతకీ వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారా, అసలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారా అంటే అది కూడా తెలియదు. కానీ వర్షిణి ఏదైనా ఫోటో పోస్ట్ చేస్తే మాత్రం, కిందని కామెంట్స్ వాషింగ్టన్ సుందర్ గురించే పెడుతున్నారు. సాంఘిక మాధ్యమాల్లో కూడా వీళ్ళిద్దరూ బాగా వైరల్ అయ్యారు. అసలు విషయం తెలియాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు దీని గురించి మాట్లాడాలి.

వీళ్ళకి ఆదర్శం చాలామందే వున్నారు, విరాట్ కోహ్లీ (ViratKohli) అనుష్క శర్మ (AnushkaSharma), కెఎల్ రాహుల్(KLRahul) అతియా శెట్టి (AthiyaShetty), ఇలా క్రికెటర్లు సినిమా తారలతో ప్రేమలో పది పెళ్లాడిన వారే కదా.

Updated Date - 2023-05-23T18:50:34+05:30 IST