Legal problem for Ravi Teja film: 'టైగర్ నాగేశ్వరరావు' డైలాగు గురించి సీరియస్ అయిన హైకోర్టు, నిర్మాతకి నోటీసులు
ABN , First Publish Date - 2023-08-31T17:14:19+05:30 IST
'టైగర్ నాగేశ్వర రావు' సినిమా చిక్కులో పడింది. ఈమధ్యనే విడుదలైన ఈ సినిమా టీజర్ లో కొన్ని మాటలు ఒక కమ్యూనిటీ ప్రజలని, ఊరుని కించపరిచేవిగా ఉన్నాయని హై కోర్టు సీరియస్ అయింది. నిర్మాతకి, సెంట్రల్ సెన్సార్ బోర్డు ఆఫీసర్ కి నోటీసులు జారీ చేసింది.
రవి తేజ (RaviTeja) నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' #TigerNageswaraRao సినిమా చిక్కుల్లో పడినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. అందులో డైలాగుల గురించి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ చాలా సీరియస్ అయింది. ఈ డైలాగు ఒక కమ్యూనిటీ ప్రజల గురించి కించ పరిచే విధంగా ఉందని సీరియస్ అయింది. ఈ చిత్ర నిర్మాతకి, అలాగే ముంబాయి లోని సెన్సార్ బోర్డు చైర్మన్ కి కూడా నోటీసులు జారీ చేసింది.
ఈ సినిమాలో స్టువర్టుపురం (Stuartpuram) అన్న పదాన్ని ఆలా ఎలా వాడతారు అని కోర్టు ఈ చిత్ర నిర్వాహకులని అడిగింది. మీకు సామజిక భాద్యత లేదా అని కూడా గట్టిగా అడిగింది. మీరు సెన్సార్ చేయించకుండా ఇది ఎలా విడుదల చేశారు, ఈ సినిమాలో ఇలాంటి మాటలు చెప్పించటం ద్వారా సమాజానికి మీరు ఏమి చెప్పదలిచారు. ఆ మాటల వలన, కొంతమంది ప్రజల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి, ఆ విషయం మీకు తెలియడం లేదా" అని కోర్టు నిలదీసింది.
ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ (AbhishekAgarwal) కి కోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని కూడా అడిగినట్టుగా తెలిసింది. ఈ సినిమాకి దర్శకుడు వంశి కృష్ణ (VamsiKrishna), ఇందులో కృతి సనన్ (KritiSanon) చెల్లెలు నుపుర్ సనన్ (NupurSanon) తెలుగులో ఆరంగేట్రం చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ (PawanKalyan) మాజీ భార్య రేణుకా దేశాయ్ (RenukaDesai) ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది.