Kannada Language: ఎయిర్‌పోర్ట్‌లో వివాదం.. కొరియోగ్రాఫర్‌కి చేదు అనుభవం!
ABN , First Publish Date - 2023-03-16T18:43:21+05:30 IST
రియాల్టీ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ ఫేమ్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ సల్మాన్ యూసఫ్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది.
రియాల్టీ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ (Dance india Dance) ఫేమ్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ సల్మాన్ యూసఫ్ ఖాన్(salman yousuf khan)కు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారి తనని వేధింపులకు గురి చేశాడని సల్మాన్ ఆరోపణలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో కన్నడలో మాట్లాడలేదనే కారణంతో తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలిపారు. ఈ విషయాన్ని అంతటిని ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. (Kannada language issue in Airport)
‘‘దుబాయ్‌కు వెళ్తున్న సమయంలో కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ఇమ్మిగ్రేషన్ అధికారిని కలిశాను. ఆయన కన్నడలో మాట్లాడుతున్నారు. నాకు కన్నడ రాదు. అక్కడికీ నాకు వచ్చినట్లుగా ఆయనకు కన్నడలో జవాబిచ్చాను. దాంతో ఆగ్రహానికి గురైన ఆయన నా పాస్‌పోర్ట్‌లో ఉన్న వివరాలను చూపిస్తూ.. ‘‘నువ్వు, మీ తండ్రి పుట్టింది బెంగళూరులోనే అయినా నీకు కన్నడ రాదా?’’ అని ప్రశ్నించాడు. నేను బెంగళూరులోనే పుట్టినప్పటికీ పెరిగిందంతా సౌదీలోనే అని చెప్పాను. దానికి ‘‘నువ్వు ఇప్పుడు కన్నడలో మాట్లాడకపోతే నిన్ను అనుమానితుడిగా భావిస్తా’’ అని చెప్పారు. ఏ కారణాల వల్ల నన్ను అనుమానితుడిగా భావిస్తారు అని గట్టిగా మాట్లాడటంతో.. ‘నా ఇష్టం అని బదులిచ్చి సైలెంట్ అయిపోయారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ట్రై చేశా. కానీ, ఎవరూ సహాయం చేయలేదు. అందుకే ఇలా ఇన్‌స్టాలో షేర్ చేస్తున్నా. ఇలాంటి ఘటనను నేను అసలు ఊహించలేదు. నేను కర్ణాటకకు చెందిన వాడిని. నా మూలాలు ఏంటో నాకు తెలుసు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సల్మాన్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.