Vaishnav Tej : 'ఆది కేశవ'లో ప్రత్యేకలు ఏంటో తెలుసా?

ABN , First Publish Date - 2023-11-21T18:23:31+05:30 IST

ఉప్పెన' చిత్రంతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'ఆది కేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

Vaishnav Tej : 'ఆది కేశవ'లో ప్రత్యేకలు ఏంటో తెలుసా?

'ఉప్పెన' చిత్రంతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌(vaishnav tej). ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'ఆది కేశవ (Aadi kesava)’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ (NAga vamsi) సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి మంగళవారం వైష్ణవ్‌ మీడిమాతో మాట్లాడారు.

'రంగ రంగ వైభవంగా' చిత్రీకరణ చివరి దశలో ఉన్నప్పుడు నాగవంశీ ఈ కథ వినమని చెప్పారు. కథ వినగా ఎక్కడో బాగా ఎట్రాక్ట్‌ అయ్యా. తుది మెరుగులుదిద్ది చిత్రీకరణ ప్రారంభించాం. మాస్‌ హీరోగా ఎలివేట్‌ కావాలని ఈ చిత్రం చేయలేదు. కథ నచ్చింది.. నిజాయతీగా చేశానంతే. సినిమా చేస్తాను కానీ దాని ఫలితం గురించి ఆలోచించను. అది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. నా వంతు ఏం చేయాలి అది చేస్తా. ఎవరైనా వచ్చిన నవ్వు హీరోవి అంటే నేను ఒప్పుకోను. నేను ఒక నటుడిని అని చెబుతా. నటుడు అనిపించుకుంటేనే విభిన్న పాత్రలు చేసే  అవకాశం ఉంటుందని మా చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పారు. అదే ఫాలో అవుతా.

ప్రత్యేకత ఏంటి అంటే..

ఇందులో పది శాతం దైవత్వం ఉంటుంది. శివుడి గురించి కథలో భాగంగానే చెప్పాం. ఇక కొత్తగా సాగే పక్కా మాస్‌ మసాలా సినిమా ఇది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్‌ ఎవరూ టచ్‌ చేయలేదు అనిపించింది. ఇందులో కామెడీ, సాంగ్స్‌, విజువల్స్‌, ఫైట్స్‌ అన్నీ బాగుంటాయి. యాక్షన్‌ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి. సాధ్యమైనంతమేర సహజంగానే చిత్రీకరించాం. ఫైట్స్‌ ఎక్కడా ఓవర్‌ ది బోర్డ్‌ ఉండవు. కొడితే పది మంది గాలిలో ఎగరడం లాంటివి ఉండవు. నా వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయి. ప్రేక్షకులు సినిమా చూసి థియేటర్ల నుంచి ఆనందంగా బయటకు వస్తారు.

నేను డాన్సర్‌ని కాదు..

నేనసలు డ్యాన్సర్‌ని కాదు. పాట చిత్రీకరణకు వెళ్లేటప్పుడు 'మీరు టేక్‌ ఓకే అనేవరకు నేను ఎంతైనా కష్టపడి చేస్తాను’ అని మాస్టర్‌కి చెబుతా. 100 శాతం కష్టపడి పని చేయడానికి నేనెప్పుడూ సిద్థంగా ఉంటాను. మొదటి రెండు టేకులకే ఎలా చేయాలి, ఎంత ఎనర్జీ పెట్టాలో అర్థమైపోయింది. మాస్టర్‌, శ్రీలీల మద్దతుతో పూర్తి న్యాయం చేయగలిగాను. దర్శకుడు కథ ఏం చెప్పారో అలాగే తెరకెక్కించారు. జోజు జార్జ్‌ గారు స్వీట్‌ పర్సన్‌. ఆయనతో సెట్స్‌ లో ఉన్నప్పుడు విజయ్‌ ేసతుపతి గారిని చూసినట్లే అనిపించేది. ఆయన భోజన ప్రియుడు. అంత పెద్ద యాక్టర్‌, నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ అయినప్పటికే డౌన్‌ టు ఎర్త్‌ ఉంటారు.

ముద్దుగా...

నాకు శ్రీలీలకు మధ్య సన్నివేశాలు క్యూట్‌గా ఉంటాయి. సంభాషణలు సహజంగా. సరదాగా సాగుతాయి. చిత్రీకరణ సమయంలో ఆడుతూపాడుతూ పని చేశాం. ఆ పాత్రలోని అమాయకత్వం, తింగరితనంతో దర్శకుడు శ్రీకాంత్‌ హాస్యం రాబట్టారు. ఆ సన్నివేశాలన్నీ స్ర్కీన్‌ మీద చాలా ముద్దుగా ఉంటాయి.

రాధికగారి క్యారెక్టర్‌ కూడా బావుంటుంది. అంత సీనియర్‌ నటి సెట్‌లో ఎలా ఉంటారో అనుకున్నాను. కానీ ఆమె అందరితో బాగా కలిసిపోయి సరదాగా మాట్లాడతారు. ఎంతో ఎనర్జిటిక్‌ గా ఉంటారు. జి.వి. ప్రకాష్‌ చక్కని పాటలిచ్చారు. మెలోడీ, మాస్‌ బీట్‌ ఏదైనా ఆయన ఇవ్వగలరు.

అవార్డుతో ఆనందం..

ఉప్పెనకు నేషనల్‌ అవార్డు రావడంతో ఎంతో సంతోషించా. అందరి కష్టానికి తగిన ఫలితం వచ్చింది అనిపించింది. బన్నీకి అవార్డ్‌ రావడం గర్వంగా ఉంది. నేను ఒక సినిమా అంగీకరించాలి అంటే అందులో ఖచ్చితంగా కొత్తదనం ఉండాలి. చేసే పాత్రలో కమర్షియాలిటీ ఉండేలా చూసుకుంటా. ఈ తరం మెచ్చేలా ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటా. హీరోగానే కాకుండా విలనగా నటించడానికైనా నేను సిద్ధమే!

ఇక తన మేనమామ మెగాస్టార్‌ చిరంజీవి అంటే తనకి ఎంతిష్టమో చెప్పాడు వైష్ణవ్‌. ఓ సందర్భంలో చిరు అని ఇంగ్లిష్‌ అక్షరాలు వచ్చేలా క్రాఫ్‌ చేయించుకున్న ఫొటో గురించి అడగగా వైష్ణవ్‌ స్పందించారు. 'ఓ ఏడాది మావయ్య పుట్టినరోజుకు అందరూ గిఫ్ట్స్‌ తెచ్చారు. సాయిధరమ్‌ తేజ్‌ పెద్ద కత్తిని బహుమతిగా ఇచ్చాడు. అయితే ఆయనకు నా ప్రాణం తప్ప ఏం ఇవ్వగలను అనిపించింది. దాంతో సర్‌ప్రైజ్‌ చేద్దామని చిరు అని వచ్చేలా హెయిర్‌ క్రాఫ్‌ చేయించుకున్నా. మా కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా రామ్‌చరణ్‌ స్పెషల్‌ ఎట్రాక్షనగా నిలుస్తాడు. చాలా హుందాగా ఉంటాడు.

Updated Date - 2023-11-21T18:28:40+05:30 IST