Gayatri Bhardwaj : నిజజీవితంలో అలా కాదు.. కానీ 'టైగర్‌’లో ప్రత్యేకం!

ABN , First Publish Date - 2023-10-08T13:32:53+05:30 IST

"ఈ చిత్రంలో నా పాత్ర పేరు మణి. గ్రామీణ నేపథ్యం ఉన్న అమ్మాయిని అయినా టామ్‌బాయ్‌లా కనిపిస్తా. రా అండ్‌ రస్టిక్‌గా ఉంటుంది నా పాత్ర. అయితే నిజజీవితంలో నేనిలా ఉండను. చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటా. మణి పాత్ర కోసం 60 మందిని ఆడిషన్  చేశారు. అందులో నాకు అవకాశం దక్కింది’’ అని గాయత్రి భరద్వాజ్‌ అన్నారు.

Gayatri Bhardwaj :  నిజజీవితంలో అలా కాదు.. కానీ 'టైగర్‌’లో ప్రత్యేకం!

"ఈ చిత్రంలో నా పాత్ర పేరు మణి. గ్రామీణ నేపథ్యం ఉన్న అమ్మాయిని అయినా టామ్‌బాయ్‌లా కనిపిస్తా. రా అండ్‌ రస్టిక్‌గా ఉంటుంది నా పాత్ర. అయితే నిజజీవితంలో నేనిలా ఉండను. చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటా. మణి పాత్ర కోసం 60 మందిని ఆడిషన్  చేశారు. అందులో నాకు అవకాశం దక్కింది’’ అని గాయత్రి భరద్వాజ్‌ (gayathri Bharadwaj) అన్నారు. రవితేజ (Ravi teja) హీరోగా నటించిన ుటైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంతో ఆమె తెలుగుతెరకు పరిచయమవుతోంది. వంశీ దర్శకత్వంలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది ఈ సందర్భంగా హీరోయిన గాయత్రి భరద్వాజ్‌ విలేకర్ల సమావేశంలో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

మాది ఢిల్లీ. మా నాన్న పైలెట్‌, అమ్మ సైకాలజిస్ట్‌. సినిమా నేపథ్యం లేని కుటుంబం మాది. ఇంట్లో చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో ప్రోత్సహించేవారు. భరతనాట్యం, క్లాసికల్‌ సింగింగ్‌ నేర్చుకున్నాను. కళలకు సంబంధించిన ప్రతి విషయంలో సపోర్ట్‌ చేశారు. నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్‌ వరల్డ్‌లో ఫేమస్‌ అవ్వాలని కోరిక. 2018లో మిస్‌ యునైటెడ్‌ కాంటినెంట్స్‌ టైటిల్‌ గెలిచాను. తర్వాత ఓ ప్రాజెక్ట్‌ సైన్‌ చేశాను. కోవిడ్‌ కారణంగా ఆలస్యమైంది. తర్వాత 'దిన్దొర’పాటు మరో సిరీస్‌ చేశాను.

Gayathri-2.gif

ఏ లెవల్‌కు తీసుకెళ్ళాలో అలా తెలిసింది...

ఓసారి వంశీ నుంచి కాల్‌ వచ్చింది. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ కథ చెప్పారు. నా పాత్రకు మూడు గంటలు నెరేషన ఇచ్చారు. ఆ పాత్ర వినగానే కళ్లు చెమ్మగిల్లాయి. కథలో చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి. అలాగైనా ఈ సినిమా చేయాలని ఫిక్స్‌ అయ్యా. ఆ పాత్ర కోసం దాదాపు 60మందిని ఆడిషన చేశారట. ఆ పాత్రకు నేను యాప్ట్‌ అవుతానని నమ్మి ఈ చిత్రంలో భాగం చేశారు. రవితేజ గారి ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది. నా క్యారెక్టర్‌ పేరు మణి. పెరిగింది గ్రామీణ నేపథ్యంలో అయినా టామ్‌బాయ్‌లా కనిపిస్తా. చాలా రా అండ్‌ రస్టిక్‌గా ఉంటుంది. సెట్‌ మీదకెళ్లాక విశాల్‌ భరద్వాజ్‌ డైరెక్ట్‌ చేసిన ఓ రెండు హిందీ సినిమాలు చూడమన్నారు. ఆ సినిమాలు చూసిన తర్వాత నా పాత్రను ఏ లెవల్‌ వరకూ తీసుకెళ్ళాలో ఒక అవగాహన వచ్చింది. 70-80 లో జరిగే కథ ఇది. టైగర్‌ నాగేశ్వరరావు అన్‌ ప్రెడిక్ట్‌ బుల్‌, స్ర్టాంగ్‌, అండ్‌ డైనమిక్‌. ఎవరూ ఊహించిన హై ఎనర్జీ, యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటాయి. ఇప్పటి వరకూ చూడని యాక్షన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఇందులో నా అపియరెన్స గురించి మర్చిపోయాను. కేవలం పాత్రపైనే దృష్టిపెట్టా. రవితేజ, దర్శకుడి సపోర్ట్‌ బావుంది.

తెలుగు సవాలే...

మొదట తెలుగు మాట్లాడటానికి ఇబ్బంది పడ్డా. వంశీకి హిందీ బాగా వచ్చు. ఆయన చెప్పింది అర్థం చేసుకున్నా. తెలుగు ట్యూటర్‌ని పెట్టుకున్నా. ప్రతి డైలాగ్‌ వెనుక వున్న ఎమోషన్‌, మీనింగ్‌ సంపూర్ణంగా అర్థమయ్యేలా చెబుతారు. ఇప్పుడు నాకు తెలుగు చాలావరకూ అర్థమవుతుంది. అయితే తెలుగు నేర్చుకోవడం సవాల్‌గానే అనిపించింది.

Gayathri.gif

దేశం అంతా గుర్తు పెట్టుకుంటుంది...

జనరల్‌గా దొంగల గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోరు. అయితే నాగేశ్వరరావు గురించి దేశం అంతా మాట్లాడుతుంది. ఆయన ఢిల్లీతోపాటు అనేక నగరాల్లో దొంగతనాలు చేశారు. ఇందులో ఇందిరాగాంఽధీ గారి ఎపిసోడ్‌ కూడా వుంది. అది ఏమిటనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. సినిమా నిర్మాణ విలువలు నచ్చాయి.

గర్వించిన సమయం...

తెలుగు పరిశ్రమ ఓ అద్భుతం. ఇక్కడి ప్రేక్షకులు సినిమాను ఎంతగానో ఆదరిస్తారు. కథకు ఎక్కువ విలువిస్తారు. ుఆర్‌ఆర్‌ఆర్‌’ టీం కు ఆస్కార్‌ వచ్చినప్పుడు చాలా గర్వపడ్డాను. ఇంతగొప్ప పరిశ్రమలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. తెలుగులో నా ఫేవరెట్‌ హీరో రామ్‌ చరణ్‌ గారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాని చాలా ఎంజాయ్‌ చేశాను.

Updated Date - 2023-10-08T13:33:28+05:30 IST