MegaStarChiranjeevi: మరోసారి మరో కుటుంబాన్ని ఆదుకున్న చిరు

ABN , First Publish Date - 2023-02-02T13:29:36+05:30 IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద స్టార్ గా ఎదగటమే కాదు, ఆ పరిశ్రమ ఇంతవాడిని చేసింది, అందుకు ప్రతిఫలంగా సమాజానికి, సినిమా పరిశ్రమకి కూడా ఇతోధికంగా తన వంతు సాయం చేయాలన్న మంచి మనసు వున్న స్టార్ మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi).

MegaStarChiranjeevi: మరోసారి మరో కుటుంబాన్ని ఆదుకున్న చిరు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద స్టార్ గా ఎదగటమే కాదు, ఆ పరిశ్రమ ఇంతవాడిని చేసింది, అందుకు ప్రతిఫలంగా సమాజానికి, సినిమా పరిశ్రమకి కూడా ఇతోధికంగా తన వంతు సాయం చేయాలన్న మంచి మనసు వున్న స్టార్ మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi). అందుకే పరిశ్రమతో అనుబంధం వున్న ఎంతోమంది సాయం కోసం ఎదురు చూడకుండానే నేను వున్నాను అని వెంటనే ముందుకు వచ్చి వాళ్ళను ఆదుకునే పెద్ద మనసున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇలా ఎన్ని వందల సార్లో చిరంజీవి ఇలా ముందుకు వచ్చి ఎన్నో కుటుంబాలను ఆడుకుంటున్నారు, అది తన ధర్మం అంటారు వినయంగా చిరంజీవి. సంపాదించే వాళ్ళు చాలామంది వున్నా, ఇచ్చే మనసుండాలి కదా, ఆ ఇచ్చే గుణం చిరంజీవి కి బాగా అబ్బింది. అందుకే అన్నయ్యా అని కేక వేస్తె చాలు, ఆదుకుంటాడు అతను.

chiru-help1.jpg

మాన‌వ‌సేవే మాధవ సేవ అని మ‌న‌సా వాచా న‌మ్మే మెగాస్టార్ చిరంజీవి మ‌రో సారి త‌న ఉదార‌త చాటుకున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ తరం వారికి తెలియకున్నా 80, 90లలో కెమెరామెన్ దేవరాజ్ (Cameraman Devraj) అంటే దక్షిణ భారత దేశంలో ఒక క్రేజ్ ఉండేది. ఎన్టీఆర్ (NTR), ఏఎన్ఆర్ (ANR), ఎంజిఆర్ (MGR), రాజ్ కుమార్, రజినీకాంత్ (Rajanikanth), కృష్ణంరాజు, కృష్ణ (Super Star Krishna), శోభన్ బాబు, మురళీమోహన్, మోహన్ బాబు (Mohan Babu), చిరంజీవి, బాలకృష్ణ (Balakrishna), నాగార్జున (Nagarjuna), వెంకటేష్.. ఇలా ఎందరో పెద్ద పెద్ద నటులతో దేవరాజ్ పని చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ భాషలలో కూడా సినిమాటోగ్రాఫర్ గా దాదాపు 300కు పైగా సినిమాలు చేశారు.

అయితే ఇప్పుడు ఆయన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు. తాజాగా ఈ విషయాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ వెలుగులోకి తీసుకు వచ్చింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన నాగు, పులిబెబ్బులి, రాణి కాసుల రంగమ్మ వంటి సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసిన దేవరాజ్ ఆర్ధిక పరిస్థితి తెలుసుకుని క్షణం ఆలస్యం చేయకుండా 5లక్షల రూపాయలిచ్చి ఆయనకు సహాయం చేశారు మెగాస్టార్ చిరంజీవి. తన నివాసానికి దేవరాజ్ ను పిలిపించుకోవడమే కాక ఆయనకు ఆతిధ్యం ఇచ్చి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. దటీజ్ చిరంజీవి!

Updated Date - 2023-02-02T13:29:37+05:30 IST