Ram charan - GMA: షోలో ఏమన్నారంటే... మరోవైపు చిరు ఆనందం

ABN , First Publish Date - 2023-02-23T11:58:23+05:30 IST

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం లాస్‌ వేగస్‌లో ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరాలో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన నేపథ్యంలో అక్కడ ఆయన పలు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Ram charan - GMA:  షోలో ఏమన్నారంటే... మరోవైపు చిరు ఆనందం

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) ప్రస్తుతం లాస్‌ వేగస్‌లో ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరాలో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన నేపథ్యంలో అక్కడ ఆయన పలు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ టెలివిజన్‌ టాక్‌ షో ‘గుడ్‌ మార్నింగ్‌ అమెరికా’ (ramcharan in Good morning america show) నుంచి ఆయనకు పిలుపొచ్చింది. తాజాగా రాంచరణ్‌ ఈ షోలో పాల్గొన్నారు. ముగ్గురు యాంకర్లు చరణ్‌తో చిట్‌ చాట్‌ (Ram charan chitchat) చేశారు. వీరితో చెర్రీ సంభాషణ సరదాగా సాగింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రధానంగా స్నేహం, అన్నదమ్ముల నేపథ్యంలో సాగే చిత్రమని చరణ్‌ చెప్పారు. అంతే కాదు... రాజమౌళి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ‘‘మా దర్శకుడు రాజమౌళి గొప్ప రచనల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ ఒకటి. ఆయన్ని మేమంతా ఇండియన్‌ స్పీల్‌ బర్గ్‌ అని ిపిలుస్తాం. సినిమా అవుట్‌పుట్‌ కోసం అహర్నిశలు కష్టపడతారు. ఆ అంకితభావమే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చేలా చేసింది. ‘నాటు నాటు’ పాటను ఆస్కార్‌ నామినేషన్‌ వరకూ తీసుకెళ్లింది. 88 ఏళ్ల ఇండియన్‌ సినిమా హిస్టరీలో తొలిసారి ఓ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేట్‌ కావడం మాకెంతో గర్వంగా ఉంది’’ అని అన్నారు.

ఇంతలో మరో యాంకర్‌ త్వరలో తండ్రి కాబోతున్నారు ఆ ఫీలింగ్‌ ఎలా ఉందని ప్రశ్నించగా ‘‘అందుకు ఎలాంటి భయం లేదు. కానీ ఇన్నేళ్లు నేను ఉపాసనకు అంతగా దొరికేవాడిని కాదు. కానీ ఇప్పుడు తప్పడం లేదు’’ అని సరదాగా సమాధానమిచ్చారు చెర్రీ. అక్కడున్న యాంకర్స్‌లో ఒక లేడి యాంకర్‌ గైనకాలజిస్ట్‌ కావడంతో మీ నంబర్‌ ఇవ్వండి ఉపాసన, నేను అమెరికాలో వచ్చినప్పుడు కలుస్తాం. అందుబాటులో ఉండండి’ అని చరణ్‌ ఫన్నీగా అడిగారు.

3.jpg

రాజమౌళి విజన్‌ ప్రపంచాన్ని చుట్టేస్తుంది: చిరు ఆనందం

చిరంజీవికి 9Chiranjeevi happy with CHaran) తన కుమారుడు చరణ్‌ అంటే ఎంత ఇష్టమో... అందరికీ తెలిసిందే! రామ్‌చరణ్‌ ఎదుగుదల చూసి ఆయన ఎంతో మురిసిపోతుంటారు. తాజాగా ఆయన క్లౌడ్‌నైన్‌లో హ్యాపీనెస్‌లో ఉన్నారు. తన పుత్రుడు అమెరికాలోని ఫేమస్‌ టాక్‌ షో ‘గుడ్‌ మార్నింగ్‌ అమెరికా’లో పాల్గొని సందడి చేశారు. ఆ ఫొటోలను చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘తెలుగు సినిమా, భారతీయ సినిమా గర్వంచే సందర్భమిది. ఎంతో పేరున్న టెలివిజన్‌ టాక్‌ షోలో రామ్‌చరణ్‌ కనిపించాడు. విజనరీ డైరెక్టర్‌ రాజమౌళి మెదడుకి తట్టిన ఈ ఆలోచన అద్భుతం. ఆయన విజన్‌తో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు’’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. (chiranjeevi tweet Viral).

Updated Date - 2023-02-23T11:58:24+05:30 IST