Chiranjeevi: దీవాళి పార్టీ.. మెగాస్టార్ చిరు డ్యాన్స్ వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-11-14T22:24:57+05:30 IST

దీపావళి సందర్భంగా గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు తమ నివాసంలో గత శనివారం రాత్రి గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రోజు పార్టీలో చిరంజీవి డ్యాన్స్ చేసిన వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది.

Chiranjeevi: దీవాళి పార్టీ.. మెగాస్టార్ చిరు డ్యాన్స్ వీడియో వైరల్
CHIRANJEEVI

దీపావళి సందర్భంగా గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన (Ram charan -Upasana) దంపతులు తమ నివాసంలో గత శనివారం రాత్రి గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో వెంకటేశ్‌, మహేశ్‌బాబు (Mahesh) - నమ్రత(namratha), ఎన్టీఆర్‌ - ప్రణతి దంపతులతో పాటు టాలీవుడ్ నటులు, దర్శక, నిర్మాతలు సందడి చేశారు. ఈ ఫొటోలను మరుసటి రోజు నమ్రత తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయగా బాగా వైరల్ అయ్యాయి.

అయితే ఇప్పుడు ఆ రోజు పార్టీలో వారంతా కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఈ రోజు (నవంబర్ 14)న బయటకు వచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ముఖ్యంగా ఓ రాప్ సింగర్ పాట పాడుతుండగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), రామ్ చరణ్ లు అక్కడికి వచ్చి పాటకు తగ్గట్టుగా స్టెప్పులు వేస్తూ అక్కడి వారిని ఉత్సాహ పరిచారు.


అయితే రామ్‌చరణ్‌, ఉపాసనల కుమార్తె క్లీంకార పుట్టిన అనంతరం వచ్చిన మొదటి దీపావళి కావడంతో ఈ పార్టీ ఏర్పాటు చేశారని సన్నిహితుల నుంచి సమాచారం.ఇదిల ఉండగా ఒకే ఫొటోలో వెంకటేశ్‌, మహేశ్‌బాబు, తారక్‌, చరణ్‌ కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు చిరంజీవి డ్యాన్స్ వీడియో ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నది. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - 2023-11-14T22:26:29+05:30 IST