Chiranjeevi: సైలిష్ లుక్ అదిరింది అంటూ ..

ABN , First Publish Date - 2023-02-19T18:27:34+05:30 IST

చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’(BholaaShankar). మెహర్‌ రమేష్‌ దర్శకుడు. తమన్నా (tamannah) కథానాయిక. కీర్తి సురేశ్‌ చిరుకి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.

Chiranjeevi: సైలిష్ లుక్ అదిరింది అంటూ ..

చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’ (BholaaShankar). మెహర్‌ రమేష్‌ దర్శకుడు. తమన్నా (tamannah) కథానాయిక. కీర్తి సురేశ్‌ చిరుకి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను(BholaaShankar motion poster) విడుదల చేశారు. అందులో చిరు చేతిలో ఢమరుకం పట్టుకొని శివతాండవం చేస్తున్నట్లుగా కనిపించారు. ఈ లుక్‌ అభిమానులను, నెటిజన్లను ఆకర్షిస్తోంది. చిరు స్టైలిష్ లుక్ అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమిళంలో హిట్‌ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది.

Updated Date - 2023-02-19T18:57:42+05:30 IST