Chiranjeevi - RRR: భారతీయుడు గర్వించేలా చేశారు

ABN , First Publish Date - 2023-03-13T10:12:00+05:30 IST

అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి, ‘నాటు నాటు’ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ు అవార్డు అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందానికి మెగాస్టార్‌ చిరంజీవి అభినందనలు తెలిపారు.

Chiranjeevi - RRR: భారతీయుడు గర్వించేలా చేశారు

భారతీయుడి కల నెరవేరింది..

ఒక వ్యక్తి విజన్‌తో సాకారమైంది..

చరణ్‌ భాగం కావడంతో తండ్రిగా గర్విస్తున్నా...

అందరికీ ప్రశంసలు దక్కాలి

- చిరంజీవి (Chiranjeevi wishes to RRR TEam)

అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి, ‘నాటు నాటు’ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్అవార్డు అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR Oscar)బృందానికి మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ఆస్కార్‌ అందుకోవడం భారత సినిమా కల. అది ఓ వ్యక్తి విజన్‌, ధైర్యం, పట్టుదలతోనే సాకారమైంది. రాజమౌళి వల్ల ఆ కల సాకారమైంది. కోట్ల మంది భారతీయుల హృదయాలు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

కీరవాణి, చంద్రబోస్‌, కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌, ప్రేమ్‌రక్షిత్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళిల పేర్లను ట్యాగ్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వారంతా చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆస్కార్‌ వరకూ తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కాలన్నారు. చరణ్‌ ఈ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందనీ, తండ్రిగా ఎంతో గర్విస్తున్నానని చిరంజీవి అన్నారు.

45.jpg

మేకర్స్‌కి స్ఫూర్తినిస్తుంది: పవన్‌కల్యాణ్‌ (pawan kalyan)

భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్‌ వేదికపై పురస్కారాన్ని అందుకున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్ర సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌కు పవన్‌కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఈ వార్త చూడగానే చాలా సంతోషించాను. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌గా పురస్కారం అందుకున్న ‘నాటు నాటు’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా, పాదం కలిపేలా చేసి హుాషారెత్తించింది. అదే ఈ రోజు ఆస్కార్‌ వేదిక మీద రెట్టింపు ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతోపాటు అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థ్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్‌.ఎస్‌.రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు. హీరోలగాఆ పాత్రల్లో ఒదిగిపోయిన ఎన్‌.టి.ఆర్‌, రాంచరణ్‌, గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌, నృత్య దర్శకులు ప్రేమ్‌ రక్షిత్‌, చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్యకు అభినందనలు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్‌ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు నటులు, రచయితలకు స్ఫూరినిస్తుంది’’ అని పేర్కొన్నారు.

Untitled-1.jpg

Updated Date - 2023-03-13T10:34:36+05:30 IST