Chinmayi Sripada: కష్టకాలంలో సమంతనే నాకు అండ
ABN , First Publish Date - 2023-03-03T20:37:12+05:30 IST
డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుంది చిన్మయి శ్రీ పాద (Chinmayi Sripada). ఆమె గొంతుకు కూడా చాలా మంది అభిమానులున్నారు. పాపులర్ హీరోయిన్ సమంత (Samantha) కు వాయిస్ ఇచ్చింది చిన్మయినే.
డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుంది చిన్మయి శ్రీ పాద (Chinmayi Sripada). ఆమె గొంతుకు కూడా చాలా మంది అభిమానులున్నారు. పాపులర్ హీరోయిన్ సమంత (Samantha) కు వాయిస్ ఇచ్చింది చిన్మయినే. మీటూ మూవ్‌మెంట్‌లో భాగంగా ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు (Vairamuthu)పై చిన్మయి 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పించారు. ఫలితంగా కోలీవుడ్ ఇండస్ట్రీ చిన్మయిని నిషేధించింది. ఆ కష్టకాలంలో సమంతనే తనకు అండగా నిలబడిందని చిన్మయి చెప్పింది.
చిన్మయి శ్రీ పాద తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా సమంత ఏ విధంగా అండగా నిలబడిందో వివరించింది. ‘‘భారత్‌లోని అందరి నటులు ఎదుర్కొన్న అన్ని ఇబ్బందులను సమంత ఎదుర్కొంది. ఆ అడ్డంకులన్నింటిని అధిగమించి ఆమె నటిగా నిలదొక్కుకుంది. మీటూ సమయంలో నాకు అండగా నిలబడింది. నాపై నమ్మకముంచి నాకు మద్దతుగా నిలిచింది. కష్టకాలంలో నాకు పనిని కూడా ఇచ్చింది. నాకు అన్ని వేళలా మద్దతు పలికింది’’ అని చిన్మయి పేర్కొంది.
మీటూ మూవ్‌మెంట్‌లో భాగంగా వైరముత్తుపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తాను పాటను రికార్డ్ చేయడానికి వెళ్లినప్పుడు లైంగిక కోరికలను తీర్చామన్నాడని ఆమె చెప్పింది. అనేక మంది మహిళలను ఈ విధంగా వేధించాడని తెలిపింది. ఫలితంగా తమిళనాడు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చిన్మయిపై నిషేధం విధించింది.