Adipurush controversy - Tirumala: ఆ పనులు సీతారాములను అవమానించడమే!
ABN , First Publish Date - 2023-06-08T11:29:44+05:30 IST
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల కథానాయిక కృతి సనన్‌ని దర్శకుడు ఓం రౌత్ కౌగిలించుకోవడం, ముద్దు పెట్టడం పెద్ద దుమారమే లేపింది. ఈ ఘటనపై భక్తులు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా చిలుకూరు బాలాజీ దేవాస్థానం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ స్పందించారు.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల కథానాయిక (Kriti sanon) కృతి సనన్‌ని దర్శకుడు ఓం రౌత్ కౌగిలించుకోవడం, ముద్దు పెట్టడం (Kiss and hug at Tirumala) పెద్ద దుమారమే లేపింది. ఈ ఘటనపై భక్తులు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా చిలుకూరు బాలాజీ (Chilukur balaji దేవాస్థానం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ (Chief preist Cs Ranga rajan) స్పందించారు. అసలేం జరిగిందంటే... మంగళవారం తిరుపతి నగరంలో ‘ఆదిపురుష్’ (Prabhas - Adipurush) చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. బుధవారం దర్శకుడు ఓంరౌత్, కృతీసనన్ తదితరులు కొండ పైన స్వామి వారి దర్శనం చేసుకున్నారు. శేష వస్త్రాలతో బయటకు వచ్చారు. సీత పాత్రధారి కృతీసనన్ కారులో వెళ్ళడానికి సిద్థమైన సమయంలో... ఓం రౌత్ ఆమె దగ్గరకు మళ్ళీ వచ్చారు. టాటా చెప్పారు. తదుపరి ఆమెను కౌగింలించుకుని చెంపపై ముద్దు పెట్టారు. ‘గాడ్ బ్లెస్ యూ’ అంటూ ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆ ఫొటోలు బయటకు రావడం నెట్టింట వైరల్ కావడంతో దీనిపై చర్చ జరుగుతోంది. (Adipurush Controversy)
దీనిపై సీఎస్ రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై ఇటువంటి వికారమైన చేష్టలు చేయకూడదు. అది సమ్మతం కాదు’’ అని మండిపడ్డారు. పవిత్ర తిరుమల కొండపై కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సిందేనని ఆయన అన్నారు. రంగరాజన్ మాట్లాడుతూ ‘‘తిరుమల కొండపై భక్తి ఆలోచన నియమాలు ఉండాలి. శ్రీవారి కొండకు భార్యభర్తలు కలిసి వచ్చినా, కళ్యాణోత్సవంలో పాల్గొన్నా సరే వారి ఆలోచనా విధానంలో జాగ్రత్త పడతారు. వేరే వికారమైన ఆలోచన రాకుండా ఉండాలని జాగ్రత్త పడతారు. కలియుగ వైకుంఠంగా శ్రీవారు కొలువై ఉన్న ఆ ప్రాంతంలో బహిరంగంగా కౌగలించుకుని, ముద్దు పెట్టుకోవడం దారుణమైన చర్య. ఇలాంటి విషయాల గురించి మాట్లాడటానికి నేను టీవీల ముందుకు రాను. కానీ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహానుభావుడు శ్రీరాముడి పాత్ర పోషించినప్పుడు వాళ్లను దైవ సమానంగా ప్రేక్షకులు చూశారు. అప్పట్లో వాళ్ళూ అంతే భక్తి శ్రద్థలతో ఉన్నారు. ఓ భక్తి చిత్రం తీసినప్పుడు దానికి తగ్గటుగా నడుచుకోవాలి. తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో లక్షలాది భక్తులు ఉన్న చోట ఆ పనులు ఏంటి’’ అని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పనులు సీతారాములను అవమానించడమే అని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్ శ్రీరాముడిగా రామాయణం ఆధారంగా రూపొందిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈ నెల 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.