Saindhav: ‘సైంధవ్’ చిల్డ్రన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

ABN , First Publish Date - 2023-11-14T21:21:55+05:30 IST

2024లో విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సైంధవ్’ ఒకటి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం రాబోయే సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రచార పోస్టర్స్‌తో దూసుకెళుతోన్న ఈ సినిమా నుండి.. నవంబర్ 14, చిల్డ్రన్స్ డే‌ని పురస్కరించుకుని.. మేకర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేశారు.

Saindhav: ‘సైంధవ్’ చిల్డ్రన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్
Saindhav Movie Still

2024లో విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) 75వ ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సైంధవ్’ (Saindhav) ఒకటి. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం రాబోయే సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రచార పోస్టర్స్‌తో దూసుకెళుతోన్న ఈ సినిమా నుండి.. నవంబర్ 14, చిల్డ్రన్స్ డే‌ని పురస్కరించుకుని.. మేకర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో బేబీ సారాని బైక్ పై స్కూల్‌కి తీసుకెళ్తూ చిరునవ్వుతో కనిపించారు వెంకటేష్. ఇది చిల్డ్రన్స్ డే‌కి పర్ఫెక్ట్ పోస్టర్‌గా అందరినీ అలరిస్తోంది. (Saindhav Children’s day Special Poster)

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ‘సైంధవ్’ టీజర్ (Saindhav Teaser) నేషనల్ వైడ్‌గా మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. శైలేష్ కొలను, వెంకటేష్‌ని మునుపెన్నడూ లేని ఇంటెన్స్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారని ప్రశంసలు అందుకున్నారు. నవంబర్ 21న సినిమా ఫస్ట్ సింగిల్-రాంగ్ యూసేజ్‌ లాంచ్ ద్వారా మ్యూజికల్ జర్నీని కిక్ స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ (Santosh Narayanan) ఈ చిత్రం కోసం చార్ట్ బస్టర్ ఆల్బమ్‌ని కంపోజ్ చేసినట్లుగా యూనిట్ చెబుతోంది.


Saindhav.jpg

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ (Niharika Entertainment) పతాకంపై వెంకట్ బోయనపల్లి (Venkat Boyanapalli) గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌లు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. ఈ సినిమాని 13 జనవరి, 2024న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో విడుదల చేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

========================

*Radha Madhavam: వినాయక్ హీరోగా ‘రాధా మాధవం’.. ఫస్ట్ లుక్ విడుదల

*********************************

*Roti Kapda Romance: యూత్‌ని ఆకర్షించేలా ‘రోటి కపడా రొమాన్స్’ ఫస్ట్ లుక్

*****************************

*Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. ‘దేవర’ నుండి క్రేజీ అప్‌డేట్!

*****************************

Updated Date - 2023-11-14T21:26:46+05:30 IST