RRR - Chandra Bose: అవతార్ పాటతో పోటీ పడుతుందనుకున్నా... కానీ..
ABN , First Publish Date - 2023-01-25T15:27:19+05:30 IST
ప్రపంచ సినీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ నామినేషన్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్’సినిమాలోని ‘నాటు నాటు’ పాట చోట్టు దక్కించుకోవడంపై సినీ ప్రియులందరూ హర్ణం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ సినీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ (Oscar)నామినేషన్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)సినిమాలోని ‘నాటు నాటు’ (natunatu)పాట చోట్టు దక్కించుకోవడంపై సినీ ప్రియులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాట రాసిన చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి(mm keeravani), గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలబైరవ, దర్శకుడు రాజమౌళి, ఇతర సాంకేతిక నిపుణులు, నిర్మాతల ఆనందానికి అవధులు లేవు. ‘నాటు నాటు’ పాటకు నామినేషన్స్‌లో ఉండడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘‘నాటు నాటు’ పాట ఒరిజినల్ విభాగంలో ఆ స్కార్‌కు నామినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కీరవాణి, రాజమౌళికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. చల్లగరిగ అనే చిన్న పల్లెటూరు, సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన నాలాంటి రచయితకు ఇది గొప్ప విజయం. ‘నాటు నాటు’ లిరిక్స్ రాయడానికి చాలా సమయం పట్టింది. పాటలో రాసిన ప్రతి పదమూ.. నా బాల్యం, నా గ్రామం, నా కుటుంబానికి సంబంధించినదే. నా మనసులోని భావాలకు, జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చాను’’ అని చెప్పారు. అయితే ఆస్కార్ నామినేషన్‌లో మా పాట ఉండడం నాకు నమ్మశక్యం కానిది, ఎంతో అపురూపమైనది. ఆ జాబితాలో మొత్తం 15 పాటలున్నాయి. వాటిలో ‘నాటు నాటు’ కూడా భాగమైంది. ‘అవతార్’ పాటకు ‘నాటు నాటు’కు మధ్య పోటీ ఉంటుందని అనుకున్నాను. కానీ, అన్నింటినీ దాటి ఈ పాట టాప్ 5లో ఉంది’’ అని బోస్ అన్నారు. విజయం ఎవరిదనేది తెలియాలంటే మార్చి 13 వరకూ ఎదురుచూడాల్సిందే! (Natu natu in oscar nominations)