Ceo Cherry: చెర్రీకి మాతృవియోగం!

ABN , First Publish Date - 2023-04-20T13:20:48+05:30 IST

మైత్రీ మూవీమేకర్స్‌ సీఈఓ, నిర్మాత చెర్రీ (చిరంజీవి)కి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి అనారోగ్యంతో గురువారం మరణించారు.

Ceo Cherry: చెర్రీకి మాతృవియోగం!

మైత్రీ మూవీమేకర్స్‌ సీఈఓ, నిర్మాత చెర్రీ (చిరంజీవి)కి (Chiranjeevi Cherry) మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి అనారోగ్యంతో గురువారం మరణించారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు వెల్లడించారు. (Ceo Cherry mother is no more)

1994లో చెర్రీ సినీరంగంలో అడుగుపెట్టారు. రాంగోపాల్‌ వర్మ తీసిన ‘మనీ’, ‘రంగీలా’ చిత్రాలకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా, కృష్ణ వంశీ ‘గులాబి’కి కో-ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు చంద్రశేఖర్‌ ఏలేటి చిత్రాలకు మార్కెటింగ్‌ విభాగంలో, రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’ చిత్రాలకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా, ‘యమదొంగ’ చిత్రానికి నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ‘ఒక్కడున్నాడు’ చిత్రాన్ని నిర్మించారు. కొంత విరామం తర్వాత మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో సీఈఓగా చేరారు. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో ‘మత్తు వదలరా’ వంటి చిన్న బడ్జెట్‌ చిత్రాలను నిర్మించారు. తాజాగా ఆయన నిర్మాణంలో కిరణ్‌ అబ్బవరం హీరోగా ‘మీటర్‌’ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం విడుదలైంది.

రాజమౌళి కుటుంబం పరామర్శ...

చెర్రీ తల్లి మరణవార్త తెలుసుకున్న రాజమౌళి, కుటుంబ సభ్యులు చెర్రీ ఇంటికి చేరుకుని పరామర్శించారు. తన తల్లి పార్దీవదేహానికి నివాళులు అర్పించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’ చిత్రాలకు చెర్రీ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఎన్టీఆర్‌ - రాజమౌళి కాంబినేషన్‌లో భారీ విజయం సాధించిన ‘యమదొంగ’ చిత్రానికి నిర్మాతల్లో ఒకరిగా చెర్రీ వ్యవహరించారు.

ఓ పక్క మైత్రీ సంస్థపై ఐటీ రైడ్స్‌ జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో నిర్మాణ సంస్థకు కీలకంగా ఉన్న చిరంజీవి చెర్రీ మాతృమూర్తి మరణించడం బాధాకరమని ఆయన సన్నిహితులు వాపోతున్నారు. చెర్రీ స్నేహితులంతా ఆయన మాతృమూర్తికి నివాళులు అర్పిస్తున్నారు.

Updated Date - 2023-04-20T14:04:31+05:30 IST