Sai Rajesh: దర్శకుడికి నిర్మాత ఖరీదైన గిఫ్ట్
ABN , First Publish Date - 2023-07-04T16:36:41+05:30 IST
దర్శక నిర్మాత సాయి రాజేశ్‌కు నిర్మాత ఎస్‌కేఎన్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ వేసుకున్న షూస్‌ను తన నిర్మాత గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సాయి రాజేశ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఎస్‌కేఎన్ తనకు షూస్ ఇస్తున్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
దర్శక నిర్మాత సాయి రాజేశ్‌కు (Sai rajesh) నిర్మాత ఎస్‌కేఎన్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ‘బ్రో’ (Bro)సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ వేసుకున్న షూస్‌ను తన నిర్మాత గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సాయి రాజేశ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఎస్‌కేఎన్ (SKN) తనకు షూస్ ఇస్తున్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ‘బేబీ’ సినిమా. ఇటీవల ఫస్ట్ కాపీని చిత్ర యూనిట్ చూసింది. నిర్మాత ఎస్‌కెఎన్ ఈ సినిమా బాగా నచ్చేసిందట. ఆ ఆనందంతో దర్శకుడికి గిప్ట్ ఇచ్చారట.
పవన్‌కల్యాణ్ ‘బ్రో’ సినిమా పోస్టర్‌లో ఆయన వేసుకున్న షూస్ అందరినీ ఆకర్షించాయి. రెగ్యులర్ షూస్ లాగా కాకుండా.. డిఫరెంట్‌గా ఉన్న ఆ షూస్ గురించి చాలామంది నెట్‌లో సెర్చ్ చేశారు. అయితే షూస్ ధర చూసి కంగు తిన్నారు. పారిస్‌కు చెందిన లగ్జరీ బ్రాండ్ ‘బల్మైన్’ తయారుచేసిన ఈ షూస్ ఽకాస్ట్ రూ.1,06,870. ఇంతటి ఖరీదైన షూస్‌ను బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్‌కు నిర్మాత ఎస్‌కెఎన్ గిఫ్ట్‌గా ఇచ్చారు.
‘‘నా ప్రొడ్యూసర్ బ్రో ‘బేబీ’ సినిమా ఫస్ట్ కాపీ చూసి ఈ షూస్‌ను నాకు బహుమతిగా ఇచ్చారు. లవ్ యూ ఎస్‌కెఎన్. మళ్లీ ఇంత ధర పెట్టి షూస్ కొనాలన్న ఆలోచన కూడా చాలా భయంగా ఉంది’ అని సాయి రాజేష్ ట్వీట్ చేశారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రధారులు. ఎస్‌కెఎన్ మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ నెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.