Bro Movie: టీజర్‌ అప్‌డేట్‌.. మాస్‌ లుక్‌ అదిరింది!

ABN , First Publish Date - 2023-06-27T15:37:10+05:30 IST

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘బ్రో’. దేవుడికీ, సాధారణ మనిషికి మధ్య సాగే క్లాసిక్‌ కథ ఇది. తెలుగుకు వచ్చే సరికి పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌నీ, తన స్టామినాను ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాలో మాస్‌ అంశాల్ని బాగా మేళవించారని తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ చూస్తుంటే అది తెలుస్తోంది.

Bro Movie: టీజర్‌ అప్‌డేట్‌.. మాస్‌ లుక్‌ అదిరింది!

పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan), సాయిధరమ్‌ (Sai dharam tej) తేజ్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘బ్రో’(BRO). తమిళంలో హిట్టైన ‘వినోదాయ సిత్తం’ చిత్రానికి రీమేక్‌గా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకుడు. దేవుడికీ, సాధారణ మనిషికి మధ్య సాగే క్లాసిక్‌ కథ ఇది. తెలుగుకు వచ్చే సరికి పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌నీ, తన స్టామినాను ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాలో మాస్‌ అంశాల్ని బాగా మేళవించారని తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ చూస్తుంటే అది తెలుస్తోంది. టీజర్‌ అప్‌డేట్‌ కోసం కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ‘తమ్ముడు’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ వేసిన కూలీ గెటప్‌లో కనిపించారు. సాయిధరమ్‌ తేజ్‌ కూడా పవన్‌ను అనుసరిస్తూ అదే లుక్‌లో కనిపించారు.

ఈ స్టిల్‌ చూస్తే బ్రో (Bro)కథలో ఇంత మాస్‌ ఉందా? అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ వైరల్‌ అవుతోంది. ‘మామ అల్లుళ్ల మాస్‌ లుక్‌ అదిరింది’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ స్ర్కీన్‌ప్లే, సంభాషణల్ని అందిస్తున్నారు. ఇందులో ఉంటే మాస్‌ అంశాలన్నీ పవన్‌ ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తాయని చెబుతున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబోట్ల నిర్మాతలు. జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Updated Date - 2023-06-27T15:55:56+05:30 IST