Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!
ABN , First Publish Date - 2023-03-23T20:48:06+05:30 IST
ఇన్ని కోట్ల మందిని నవ్వించడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అని అన్నారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. 2023 నూతన తెలుగు సంవత్సరం ఉగాది (శోభకృత్‌నామ సంవత్సరం)ని పురస్కరించుకుని
ఇన్ని కోట్ల మందిని నవ్వించడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అని అన్నారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. 2023 నూతన తెలుగు సంవత్సరం ఉగాది (శోభకృత్‌నామ సంవత్సరం)ని పురస్కరించుకుని (Ugadi) ఫిలిం నగర్‌లోని (Film Nagar) ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ (Film Nagar Cultural Club) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు (Ugadi Celebrations) ఘనంగా నిర్వహించారు. ఎఫ్.ఎన్.సి.సి (FNCC) స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాస్యబ్రహ్మ డా. బ్రహ్మానందం (Dr. Brahmanandam)ని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ (Talasani Srinivas Yadav), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం జీవితానికి సంబంధించి పలు వివరాలతో కూడిన ఏవీని ప్రదర్శించారు. పద్మశ్రీ, గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ గ్రహీత, డాక్టర్ బ్రహ్మానందంని శాలువా, గజమాలతో సత్కరించి, ఆయనకు కలియుగదైవం వేంకటేశ్వరుని ప్రతిమ, సన్మానపత్రం అందజేశారు.
అనంతరం సన్మాన గ్రహీత హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam Speech) మాట్లాడుతూ... నాకు జరిగిన సన్మానం చూస్తుంటే ‘హృదయం మొత్తం సంతోషంతో నిండిపోతే.. నోరు మూగబోతుంది’ అనే సామెత గుర్తుకు వస్తోంది. ఒక కళాకారుడు రంగస్థలం (Rangasthalam)పై ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. అంతకు మించిన దుర్మార్గం ఇంకోటి ఉండదు. నాకు జరిగిన ఈ సన్మానం నా జీవితంలో మర్చిపోలేనిది అని ఈ వేదికపై నుంచి మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఇంత భారీగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను ఊహించలేదు.
మన పండగల పూర్వాపరాలు, హిందువుల సంస్కృతుల గొప్పతనాన్ని తెలియజేస్తూ కళాకారులు చేసిన నృత్యాలు అద్భుతం. ఇన్ని కోట్ల మందిని నవ్వించడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అందరూ మోక్షం కోరుకుంటారు. అంటే జన్మరాహిత్యం.. మరో జన్మ ఉండకూడదు అని. కానీ నేను దేవుణ్ణి మోక్షం వద్దు... మళ్లీ మళ్లీ జన్మించాలని.. ఆ జన్మల్లో నేను ఏ జీవిగా పుట్టినా సరే నా తోటి జీవులను నవ్వించే వరం ప్రసాదించమని కోరుకుంటాను. ఉత్తేజ్ (Uttej) రాసిన సన్మానపత్రం చాలా గంభీరంగా ఉంది. నా హృదయాన్ని తాకింది. ఇంతమంది మహామహుల మధ్య గడిపిన ఈ క్షణాలు నాకు ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తు. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. (Brahmanandam Emotional Speech)
ఇవి కూడా చదవండి:
*********************************
*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు
*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు
*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?
*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?
*Kantara 2: కీలక అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?
*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..
*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్
*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?
*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?