Brahmaji: ఈ సినిమా డబ్బులు తీసుకోకుండా చేసాడు

ABN , First Publish Date - 2023-03-31T17:02:41+05:30 IST

ఉరిశిక్ష పడే ఖైదీలను ఉరిశిక్ష అమలు చేసే వ్యక్తిని తలారి అంటారు. అలంటి తలారి పాత్రలో బ్రహ్మాజీ అద్భుతమైన నటన కనపరిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇంతకీ ఆ సినిమా ఎదో తెలుసా...

Brahmaji: ఈ సినిమా డబ్బులు తీసుకోకుండా చేసాడు

సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించాడు. కొన్ని వందల పాత్రలు చేసిన బ్రహ్మాజీ అటు వెండి తెర మీద కానీ, ఇటు రియల్ లైఫ్ లో కానీ ఎప్పుడూ గ్రే హెయిర్ తో కనిపించలేదు. కానీ అతను మొట్టమొదటి సారి గ్రే హెయిర్ లో కనిపిస్తూ ఒక పాత్రని చేసాడు. అదే 'హేంగ్ మాన్' లో తలారి పాత్ర. తలారి అంటే ఉరిశిక్ష పడిన ఖైదీలను వురి తీసే వ్యక్తిని తలారి అంటారు.

ఇది ఒక చిన్న సినిమా. దీనికి విహాన్ అనే ఒక యువ దర్శకుడు పని చేసాడు. ఇందులో తలారి జీవితం, అతను ఉరిశిక్ష పడ్డ ఖైదీలను ఉరితీసేటప్పుడు అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, అనే విషయాలని ఈ సినిమాలో టచ్ చేసాడు. సినిమాలో బ్రహ్మాజీ తలారిగా కొడుక్కి కూడా వురి తాడు ఎలా తయారు చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెపుతూ ఉంటాడు. అది వంశ పరం పర్యంగా వస్తున్నట్టుగా ఈ సినిమాలో చూపెడతాడు దర్శకుడు.

brahmajihangman.jpg

ఈ సినిమా గురించి దర్శకుడు చాలా రీసెర్చ్ చేసాడు. ఎందుకంటే ముందు విహాన్ ఒక ఫిక్షనల్ కథ రాద్దాం అనుకున్నాడు. కానీ తరువాత అతనికి ఎందుకో ఎలా ఉరితీసే వాళ్ళని కలవాలనిపించి బయలుదేరాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, విహాన్ చెప్పినదాని ప్రకారం మన దేశంలో ఇద్దరే ఇలా వురి తీసే తలారులు ఉన్నారట. అందులో ఒకతను ఉత్తరప్రదేశ్ లో పవన్ అనే తలారి ఉంటే అతన్ని కలిశాడట విహాన్. ఇంకో ఆశ్చర్యకర సంఘటన ఏంటి అంటే నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన ఖైదీలను అతనే వురి తీసాడు అని చెప్పాడు విహాన్. ఈ తలారి లు ఎక్కువ బయటకి రావటం, నలుగురితో కలవటం చెయ్యరు, ఎందుకంటే వాళ్ళ వృత్తి అలాంటిది కదా మరి.

ఈ షార్ట్ సినిమా ఈమధ్య హైదరాబాద్ లోని ఒక ప్రివ్యూ థియేటర్ లో కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ కి చూపిస్తే, అందరూ సినిమా అయ్యాక లేచి చప్పట్లు కొట్టారు. బ్రహ్మాజీ నటన ఈ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు. ఎప్పుడూ యంగ్ గా కనపడే బ్రహ్మాజీ, ఈ సినిమాలో మాత్రం కొంచెం గ్రే హెయిర్ తో కనపడి, ఆ తలారి పాత్రని అద్భుతగా చేసి అందులో ఇమిడిపోయాడు. ఇంకో ఆశ్చర్యకరం ఏంటి అంటే ఈ సినిమా కథ నచ్చి, ఈ సినిమా దర్శకుడికి బ్రహ్మాజీ తను ఫ్రీగా నటిస్తాని అని చెప్పి అలానే డబ్బులు ఏమీ తీసుకోకుండానే చేసాడు.

నిర్భయ (Nirbhaya) లాంటి కేసుల్లో ఉరిశిక్ష వేసిన కూడా ఇంకా అలంటి సంఘటనలు జరగకుండా ఆగడం లేదు. ఉరిశిక్ష కరెక్టేనా? వురి తీసే వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుంది. అతను ఎలా ప్రిపేర్ అవుతాడు లాంటి విషయాలు చాలా చక్కగా చూపించాడు ఈ షార్ట్ సినిమాలో. ఇది ఫిలిం ఫెస్టివల్స్ కి పంపించే యోచనలో వున్నాడు, ఈ చిత్ర నిర్వాహకులు. అలాగే ఏదైనా ప్రముఖ ఓ.టి.టి. ఛానల్ కి కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.

Updated Date - 2023-03-31T17:02:44+05:30 IST