We Love Bad Boys: ‘A కడుపుబ్బే కామెడీ ఎంటర్‌టైనర్’.. రెడీ అవుతోంది

ABN , First Publish Date - 2023-11-26T20:56:17+05:30 IST

బి.ఎమ్. క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్’. పప్పుల కనకదుర్గారావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ కాపీతో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

We Love Bad Boys: ‘A కడుపుబ్బే కామెడీ ఎంటర్‌టైనర్’.. రెడీ అవుతోంది
We Love Bad Boys Still

తెలుగు సినిమా రంగంలోకి మరో నూతన నిర్మాణ సంస్థ అరంగేట్రం చేస్తోంది. అరంగేట్రం చేస్తూనే మూడు సినిమాల నిర్మాణం చేపట్టిన ఈ సంస్థ.. తమ ప్రొడక్షన్ హౌస్ నుంచి మొదటిగా వస్తున్న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ సంస్థ పేరు ‘బి.ఎమ్.క్రియేషన్స్’. ఈ సంస్థ నుంచి వస్తున్న మొదటి చిత్రం పేరు ‘వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్’ (We Love Bad Boys). బి.ఎమ్. క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పప్పుల కనకదుర్గారావు (Pappula Kanakadurga Rao) నిర్మాత.


Boys.jpg

అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి వంటి వారంతా ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం ఫస్ట్ కాపీతో విడుదలకు సిద్ధమైంది. నేటి ట్రెండ్‌కు తగిన కథ-కథనాలతో కడుపుబ్బ నవ్వించే కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర దర్శకులు రాజు రాజేంద్ర ప్రసాద్ (Raju Rajendra Prasad) చెబుతున్నారు. రఘు కుంచెతో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి తాజాగా విడుదల చేసిన పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ పోస్టర్స్‌లో ‘A కడుపుబ్బే కామెడీ ఎంటర్‌టైనర్’ అనే కాప్షన్ బాగా ఆకర్షిస్తోంది. (We Love Bad Boys Ready to Release)


ఇవి కూడా చదవండి:

====================

*Sandeep Reddy Vanga: పక్కా తెలంగాణ బిడ్డని.. ఆ రోజులు తలుచుకుంటే భయమేస్తుంది

******************************

*Geethanjali Sequel: ‘గీతాంజలి’తో అంజలి మళ్లీ వస్తోంది

******************************

*Sandeep Reddy Vanga: మహేష్ బాబుకి ఒక కథ చెప్పా.. కానీ?

******************************

Updated Date - 2023-11-26T20:56:18+05:30 IST