Nagarjuna : మీ హీరోయిన్‌ ఎక్కడ విజయ్‌!

ABN , First Publish Date - 2023-09-04T12:00:52+05:30 IST

‘బిగ్‌బాస్‌ 7’ తెలుగు సీజన్‌ ఆదివారం గ్రాండ్‌గా మొదలైంది. గత సీజన్‌లా కాకుండా ఈసారి సరికొత్తగా పాన్‌ చేశారు. ఉల్టా-పల్టా అంటూ వినూత్నంగా ప్రారంభించారు హోస్ట్‌ నాగార్జున. 14 మంది హౌస్‌మేట్స్‌ తమదైన శైలి ఎంట్రీతో ఇంట్లో అడుగుపెట్టారు. ఆదివారం జరిగిన కార్యక్రమానికి అతిథిగా విజయ్‌ దేవరకొండను హాజరయ్యారు.

Nagarjuna : మీ హీరోయిన్‌ ఎక్కడ విజయ్‌!

‘బిగ్‌బాస్‌ 7’ (BiggBoss7) తెలుగు సీజన్‌ ఆదివారం గ్రాండ్‌గా మొదలైంది. గత సీజన్‌లా కాకుండా ఈసారి సరికొత్తగా పాన్‌ చేశారు. ఉల్టా-పల్టా (ulta palta) అంటూ వినూత్నంగా ప్రారంభించారు హోస్ట్‌ నాగార్జున(Nagarjuna). 14 మంది హౌస్‌మేట్స్‌ తమదైన శైలి ఎంట్రీతో ఇంట్లో అడుగుపెట్టారు. ఆదివారం జరిగిన కార్యక్రమానికి అతిథిగా విజయ్‌ దేవరకొండను(Vijay Devarakonda) హాజరయ్యారు. ఆరాధ్య పాటకు స్టెప్పులేస్తూ గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇది చూసిన నాగార్జున ‘మీ హీరోయిన్‌ సమంత ఎక్కడ? అని ప్రశ్నించాడు. ఊహించని ఆ ప్రశ్నతో అవాక్కయ్యాడు విజయ్‌.

'‘సమంత అమెరికాలో ఉంది. యూఎస్‌ ప్రమోషన్స్‌తో పాటు, తన హెల్త్‌కు సంబంధించి ట్రీట్‌ మెంట్‌కు వెళ్ళింది. త్వరలోనే హైద్రాబాద్ వచ్చి ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది’ అని విజయ్‌ సమాధానం ఇచ్చాడు. ‘నువ్వు మంచి నటుడివి. సమంత కూడా బాగా నటిస్తుంది. సినిమాలో ఎవరిని ఎవరు డామినేట్‌ చేశారు?’ అని నాగ్‌ అడగగా, ‘నేను ఆధిపత్యం చూపిద్దామని ప్రయత్నించా. కానీ, భార్యలే కదా డామినేట్‌ చేసేది’ అనే సరికి నాగార్జున పక్కున నవ్వారు. ‘ఏమాయ చేసావె’ నుంచి సమంత అంటే ఆరాధన భావన ఉందని, ఆమెతో కలిసి నటించడం ఒక మంచి అనుభూతి అని విజయ్ చెప్పారు. ఇది చూసిన జనాలు చాలా రోజుల తర్వాత నాగార్జున నోటి నుంచి సమంత పేరు వచ్చింది అని కామెంట్లు చేస్తున్నారు. సమంత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉంటే లాంచ్‌ ఎపిసోడ్‌ మరో రేంజ్‌లో ఉండేదని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

నాతచైతన్యతో విడాకులు అయిన తర్వాత నాగార్జున్‌ ఎక్కడ సమంత పేరు తీసింది లేదు. సమంత కూడా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఎవరి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అఖిల్‌ అక్కినేని మాత్రం సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటాడు. సమంత అఖిల్‌ సినిమా విడుదల సమయంలో విషెస్‌ చెబుతుంటుంది. ప్రస్తుతం సమంత అమెరికాలో ఉన్నారు. ‘ఖుషి’ సినిమా సక్సెస్‌ను అభిమానులతో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

Updated Date - 2023-09-04T16:03:03+05:30 IST