Biggboss 7: మొదటివారం ఎలిమినేషన్స్‌!

ABN , First Publish Date - 2023-09-10T17:50:45+05:30 IST

బిగ్‌బాస్‌ ప్రారంభంలో హోస్ట్‌ అక్కినేని నాగార్జున చెప్పిన ఉల్టా పల్టా మాటను క్రమంగా పాటిస్తున్నాడు. ప్రస్తుతం హౌస్లఓ ఉన్న ఇంటి సభ్యులు ఇంకా పూర్తిగా సభ్యులు కాలేదని చెప్పారు. దీంతో వాళ్లు హౌస్‌మేట్స్‌ కానప్పుడు ఇంట్లో నుంచి ఎలా ఎలిమినేట్‌ చేస్తారనే అనుమానాలు వచ్చాయి. దాంతో ఈ వారం ఎలిమినేషన్‌ ఉండదని ప్రచారం జరిగింది.

Biggboss 7: మొదటివారం ఎలిమినేషన్స్‌!

బిగ్‌బాస్‌ ప్రారంభంలో హోస్ట్‌ అక్కినేని నాగార్జున చెప్పిన ఉల్టా పల్టా మాటను క్రమంగా పాటిస్తున్నాడు. ప్రస్తుతం హౌస్లఓ ఉన్న ఇంటి సభ్యులు ఇంకా పూర్తిగా సభ్యులు కాలేదని చెప్పారు. దీంతో వాళ్లు హౌస్‌మేట్స్‌ కానప్పుడు ఇంట్లో నుంచి ఎలా ఎలిమినేట్‌ చేస్తారనే అనుమానాలు వచ్చాయి. దాంతో ఈ వారం ఎలిమినేషన్‌ ఉండదని ప్రచారం జరిగింది. అయితే ఫైనల్‌గా బిగ్‌బాస్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు. ఉల్టా పుల్టా అన్నటుల్గఆనే ఎలిమినేషన్‌ ప్రక్రియ జరిగింది. దీంతో ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌ షూటింగ్‌ పూర్తి కావడంతో ఎవరు ఎలిమినేట్‌ అయ్యారనే విషయం సోషల్‌ మీడియాలో లీకైంది. నామినేషన్స్‌లో ఉన్నవారిని నాగ్‌ ఒక్కొక్కరిని సేవ్‌ చేసుకుంటూ రాగా చివర్లో ప్రిన్స్‌ యావర్‌, కిరణ్‌ ఇద్దరూ మిగిలారట. వీరిలో కిరణ్‌ రాథోడ్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినట్లు తెలిసింది. తెలుగు రాక కష్టపడుతున్న ఆమెను కూడా ఇంటి సభ్యులు చాలామంది నామినేట్‌ చేశారు. ఆమె కిచెన్‌ వండి వార్చింది కానీ పెద్దగా టాస్క్‌ ఆడింది లేదు. పెద్దగా ఓట్లు కూడా పడకపోవడంతో ఆమె చివరిస్థానంలో ఉండడంతోనే ఎలిమినేట్‌ అయినట్లు సమాచారం.

Updated Date - 2023-09-10T17:50:45+05:30 IST