Biggboss 7 : కెప్టెన్సీ టాస్క్‌ కాదు.. యుద్ధమే

ABN , First Publish Date - 2023-10-20T16:48:45+05:30 IST

బిగ్‌బాస్‌ సీజన్‌-7’ (biggboss) ఏడోవారం ఆసక్తికరంగా సాగుతోంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా కొత్తగా హౌస్‌లోకి కొందరు వచ్చారు. కొన్ని రోజుల కిందట టాస్క్‌లో గాయపడిన శివాజీ ఇటీవల స్కాన్  కోసం బిగ్‌బాస్‌ పర్మిషన్తో ఆస్పత్రికి వెళ్లొచ్చాడు. అయితే ఈ వారం కెప్టెన్సీ కోసం ఫ్లోట్‌ ఆర్‌ సింక్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌.

Biggboss 7 : కెప్టెన్సీ టాస్క్‌ కాదు.. యుద్ధమే

‘బిగ్‌బాస్‌ సీజన్‌-7’ (biggboss) ఏడోవారం ఆసక్తికరంగా సాగుతోంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా కొత్తగా హౌస్‌లోకి కొందరు వచ్చారు. కొన్ని రోజుల కిందట టాస్క్‌లో గాయపడిన శివాజీ ఇటీవల స్కాన్  కోసం బిగ్‌బాస్‌ పర్మిషన్తో ఆస్పత్రికి వెళ్లొచ్చాడు. అయితే ఈ వారం కెప్టెన్సీ కోసం ఫ్లోట్‌ ఆర్‌ సింక్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. కెప్టెన్  కావడానికి అనర్హుడిగా ప్రకటించి అతడి ఫొటోకు గొలుసు కట్టి స్విమ్మింగ్‌ పూల్‌లో పడేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఫొటో మునిగి పోని వారు కెప్టెన్సీ కంటెండర్‌గా ఉంటారు.

మొదట శివాజీ ఫొటోకు అమర్‌దీప్‌ గొలుసు కట్టి పూల్‌లో పడేశాడు. దీనితో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ‘మీకన్నా ఇతరులు ఎక్కువ కష్టపడి ఆడారు కదా. ఒక ఛాన్స్ ఇద్దామని’ అని అమర్‌ అనగా, ‘నేను వేస్ట్‌ క్యాండిడేట్‌లా కనిపిస్తున్నానా? ఇది న్యాయమైన ఆటా’ అంటూ శివాజీ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం శివాజీని బిగ్‌బాస్‌ కన్‌ఫెషన్‌ రూమ్‌కు పిలిచి ‘శివాజీ ఎలా ఉన్నారు’ అని ప్రశ్నించగా, ‘బాగా ఇబ్బంది పడుతున్నా బిగ్‌బాస్‌. చేయి అంతా లాగుతోంది. ఎవరూ లేకపోతే నాలో నేనే ఏడుస్తున్నా. ఎవరైనా ఉంటే నవ్వుతూ ఏడుస్తున్నా. వాళ్ల అందరి ముందు ఏడవలేకపోతున్నా. లోపల చాలా బరువుగా ఉంది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

శోభాశోట్టి అశ్వినినీ సెలెక్ట్‌ చేసి కెప్టెన అయ్యే కేపబిలిటీ లేదని ఆమె ఫొటోను పూల్‌లోకి విసిరికొట్టింది. నేనంటే ఎంత కోపమో ఫొటో విసరడంలోనే తెలుస్తోంది అంది అశ్విని. అంతే కాదు ఎప్పటికీ నేను నీకు నచ్చను’ అని కూడా చెప్పింది. అలాగే ప్రియాంక జైనకి యావర్‌కి మధ్య గొడవ అయింది. ఫైనల్‌గా రెవరు కెప్టెన అయ్యారనేది ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే! ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌ ప్రోమో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Updated Date - 2023-10-20T16:48:45+05:30 IST