Bigg boss 7 : వేటాడటానికి వచ్చాడంటే.. నేనేమైనా పేకాడేందుకు వచ్చానా అంటూ.. ఫైర్‌

ABN , First Publish Date - 2023-09-11T14:34:49+05:30 IST

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 తొలి వారం ఎలిమినేషన్‌ పూర్తయింది. 14 మంది ఇంటి సభ్యుల్లో ఒకరు బయటకు వచ్చేశారు. నటి కిరణ్‌ రాథోడ్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు రెండో వారం నామినేషన్స్‌ మొదలయ్యాయి.

Bigg boss 7 : వేటాడటానికి వచ్చాడంటే.. నేనేమైనా పేకాడేందుకు వచ్చానా అంటూ.. ఫైర్‌

'బిగ్‌బాస్‌ సీజన్‌ 7' (Biggboss 7) తొలి వారం ఎలిమినేషన్‌ పూర్తయింది. 14 మంది ఇంటి సభ్యుల్లో ఒకరు బయటకు వచ్చేశారు. నటి కిరణ్‌ రాథోడ్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు రెండో వారం నామినేషన్స్‌ మొదలయ్యాయి. హౌస్‌లో ఉండేందుకు అనుమతి దక్కించుకున్న మొదటి వ్యక్తి ఆట సందీప్‌. అన్ని టాస్క్‌ల్లోనూ విజయం సాధించి అతను పవర్‌ ఆస్త్రాను సాధించారు. సోమవారం రెండోవారం నామినేషన్స్‌ ప్రక్రియ షురూ అయ్యింది. ప్రిన్స్‌ యావర్‌ను సందీప్‌ నామినేట్‌ చేశాడు. దాంతో ‘నువ్వు నన్ను కావాలని టార్గెట్‌ చేస్తున్నావ్‌’ అంటూ ప్రిన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అలా అనుకుంటే పల్లవి ప్రశాంత్‌ను నామినేట్‌ చేేసవాడిని’ అంటూ సందీప్‌ దీటుగా సమాధానం ఇచ్చాడు.

శివాజీని (Sivaji) ప్రియాంక జైన్‌ (Priyanka Jain) నామినేట్‌ చేస్తూ ‘ఎవరైనా మాట్లాడితే, వాళ్లు ఒక పాయింట్‌ చెప్పేలోపే, మీరు దబాయిస్తున్నారు’ అని అనగా, ‘నేను ఇక్కడ బిగ్‌బాస్‌ మాట తప్ప ఎవరి మాట వినను’ అంటూ కాస్త గట్టిగానే శివాజీ దూసుకెళ్లాడు. ‘నాతో ఇలా చేయొద్దు’ అని ప్రియాంక అనగా, ‘అంతలేదమ్మా’ అంటూ శివాజీ ఆమె వ్యాఖ్యలను తీసి పారేశాడు. బిగ్‌బాస్‌’ షోలో ఎంటర్‌టైన్‌ చేయడానికి వచ్చానని, తానొక ఎంటర్‌టైనర్‌ను అని నటుడు శివాజీ అన్నారు. అటు అమర్‌దీప్‌.. పల్లవి ప్రశాంత్‌ను మధ్యలోకి లాక్కొచ్చాడు. ప్రశాంత్‌ వేటాడటానికి వచ్చాడంటే నేనేమైనా పేకాడేందుకు వచ్చానా? అని శివాజీ సెటైర్ల మీద విరుచుకుపడ్డాడు. పవర్‌ అస్త్ర సాధించిన ఆట సందీప్‌ ఇంటి సభ్యుల్లో ఒకరిని నేరుగా నామినేషన్స్‌కు పంపించవచ్చని ఆఫర్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. మరి అతడు ఎవరిని నామినేట్‌ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం శివాజీ, శోభాశెట్టి, తేజ, రతిక, ప్రిన్స్‌ యావర్‌, షకీలా.. నామినేషన్స్‌లో ఉన్నారంటూ ప్రచారం నడుస్తోంది.

Updated Date - 2023-09-11T14:37:40+05:30 IST