Biggboss 7 : కొత్తగా ఉంటుందేమో అనుకుంటే... అవే సిల్లీ రీజన్స్!
ABN , First Publish Date - 2023-09-05T17:53:17+05:30 IST
బిగ్‌బాస్ సీజన్ 7 మొదటి వారం నామినేషన్స్ వేడి మొదలైంది. హౌస్‌లో ఉండటానికి అర్హత లేని వారిని కరెక్ట్ రీజన్స్ చెప్పి నామినేట్ చేయాలి. ఇంటి సభ్యులు నామినేట్ చేయాలంటే నాకు కూర వేయలేదు, పెట్టిన అన్నంలో నాకు ఒక మెతుకు తగ్గింది, పప్పులేదు, అందులో ఉప్పులు నాకు నచ్చలేదు నామినేట్ చేశా. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేసేవారు.
బిగ్‌బాస్ సీజన్ 7 (Biggboss7) మొదటి వారం నామినేషన్స్ వేడి మొదలైంది. హౌస్‌లో ఉండటానికి అర్హత లేని వారిని కరెక్ట్ రీజన్స్ చెప్పి నామినేట్ (nominations) చేయాలి. ఇంటి సభ్యులు నామినేట్ చేయాలంటే నాకు కూర వేయలేదు, పెట్టిన అన్నంలో నాకు ఒక మెతుకు తగ్గింది, పప్పులేదు, అందులో ఉప్పులు నాకు నచ్చలేదు నామినేట్ చేశా. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేసేవారు. ఈ సీజన్ ఉల్టా – పల్టా (ulta palta) కాబట్టి ఏదైనా కొత్త తరహాలో నామినేషన్ ప్రక్రియ ఉంటుందనుకుంటే అదే రొటీన్ ఫార్ములా ఇక్కడ కూడా!
సోమవారం రాత్రి జరిగిని నామినేషన్స్ ప్రక్రియలో పల్లవి ప్రశాంత్, రతికలను ప్రియాంక జైన్ (Priyanka Jain) నామినేట్ చేేస్త.. గౌతమ్ కృష్ణ దామినిని, హీరో శివాజీ నామినేట్ చేశాడు. ఇక తరువాత జరిగిన నామినేషన్స్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమో రాగా.. ఇందులో శోభాిశెట్టి.. కార్తీకదీపం మోనితలా మారింది. కిరణ్ రాథోడ్‌కి తెలుగు రావడం లేదని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. ఆమె కూడా కన్నడ నుంచి వచ్చిందే! కార్తీకదీపం సీరియల్ వల్లతెలుగు నేర్చుకుని నాలుగు ముక్కలు తెలుగు మాట్లాడటం నేర్చుకుంది. ఈమెకే చక్కగా రాదు.. కానీ కిరణ్ రాధోడ్‌ని తెలుగు రాదని నామినేట్ చేశాని చెప్పడం సిల్లీగా అనిపించింది. దీంతో భాష పట్ల బిగ్‌బాస్‌కి లేని నొప్పి శోభాశోట్టికి ఎందుకు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏ కారణం లేకుండా ప్రిన్స్ యావర్.. షకీలాని నామినేట్ చేశాడు.
ఇంతకీ అతను ఎందుకు నామినేట్ చేశాడంటే.. ‘షర్ట్ లేకుండా హౌస్‌లోకి అడుగుపెట్టి తన పేరు ప్రిన్స్ యావర్ అని చెప్పాడు. అప్పుడు షకీలా ‘మీ నాన్న కింగ్‌నా’ అని నవ్వుతూ అన్నది. అలా అనడం అతనికి నచ్చలేదట అందుకే నామినేట్ చేశాడట. ‘ఓర్నాయనో నేను చాలా నార్మల్‌గా అన్నాను’ అని క్లారిటీ ఇచ్చింది.
సింగర్ దామిని.. శోభాశెట్టిని నామినేట్ చేయడంతో.. ఆమెను కార్తీకదీపం మోనిత ఆవహించినట్లుగా బిహేవ్ చేసింది. చేతులు ఊపుకుంటూ.. చప్పట్లు కొట్టుకుంటూ కాస్త ఓవర్ చేసింది. నేరుగా దామిని దగ్గరకు వెళ్లి.. ‘నామినేషన్స్ అనేవి ఇంటికి పంపడానికి కదా.. మీరు చెప్పిన రీజన్స్ నాకు నచ్చలేదు’ అని చెప్పింది శోభా. సరే నా నిర్ణయం తప్పై ఉండొచ్చు బిగ్ బాస్ చెప్తాడు కదా.. అని దామిని అంటుంటే.. ‘తప్పై ఉండొచ్చేంటి? అది తప్పే’ అంటూ అరవడం మొదలెట్టింది శోభా. సరే నెక్స్ట్ వీక్ నామినేట్ చేసుకో అని దామిని అంటే.. ‘మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు.. మీలాగ నేను సిల్లీ రీజన్స్‌కి నామినేట్ చేయను’ అంటూ కాస్త దురుసుగా మాట్లాడింది శోభా.
లాస్ట్‌లో గౌతమ్ కృష్ణ.. శోభా గారూ అని మర్యాదగా పిలిేస్త.. అంత రెస్పెక్ట్ అవసరం లేదు.. మీరు చెప్తే వినడానికి రెడీగా లేను’ అంటూ తెగ రెచ్చిపోయింది శోభా. ఈ స్టేజ్‌పై తాను అందరికీ కార్తీకదీపం మోనితగానే తెలుసు. కానీ తన రియల్ క్యారెక్టర్ అది కాదు.. శోభాశెట్టి ఎలా ఉంటుందో చూపిందాం అనే వచ్చాను అని తెలిపింది. మరి తనలో ఎలాంటి కోణం ఉందో చూడాలంటే బిగ్‌బాస్ చూడాల్సిందే!