Biggboss 7: నోరు అదుపులో పెట్టుకో.. అంటూ మాటల యుద్ధం!

ABN , First Publish Date - 2023-09-09T11:08:16+05:30 IST

‘బిగ్‌బాస్‌ 7’ సీజన్‌ మొదలైన మూడు రోజులు అంతంత మాత్రంగానే ఉంది. వీక్షకులు కూడా బోర్‌ ఫీల్‌ అయ్యారు. ఉల్టా పుల్టా అన్నారు.. కొత్తగా, ఊహకు అందని రేంజ్‌లో ఉంటుందన్నారు.. ఏంటీ గోలా అంటూ విమర్శలొచ్చాయి. అయితే ఇప్పుడు హౌస్‌లో కాస్త హీట్‌ పెరిగింది. టాస్క్‌లో భాగంగా కొట్టుకునే స్థితికి వెళ్లేదు కానీ బాగానే గొడవ పడుతూ కంటెంట్‌ ఇస్తున్నారు.

Biggboss 7: నోరు అదుపులో పెట్టుకో.. అంటూ మాటల యుద్ధం!

‘బిగ్‌బాస్‌ 7’ సీజన్‌ మొదలైన మూడు రోజులు అంతంత మాత్రంగానే ఉంది. వీక్షకులు కూడా బోర్‌ ఫీల్‌ అయ్యారు. ఉల్టా పుల్టా అన్నారు.. కొత్తగా, ఊహకు అందని రేంజ్‌లో ఉంటుందన్నారు.. ఏంటీ గోలా అంటూ విమర్శలొచ్చాయి. అయితే ఇప్పుడు హౌస్‌లో కాస్త హీట్‌ పెరిగింది. టాస్క్‌లో భాగంగా కొట్టుకునే స్థితికి వెళ్లేదు కానీ బాగానే గొడవ పడుతూ కంటెంట్‌ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో దామిని, కిరణ్‌ని కన్ఫెషన్‌ రూంకి పిలిచిన బిగ్‌బాస్‌ వాళ్లకి ఓ టాస్క్‌ ఇచ్చాడు. ఇంట్లో ఉన్న వాళ్ల తలపై గుడ్లు పగలగొట్టి దానితో ఆమ్లెట్‌ వేసి, తనకు ఇవ్వాలని అన్నారు. ఇందులో కిరణ్‌ రాథోడ్‌ సక్సెస్‌ అయింది. సింగర్‌ దామిని బిగ్‌బాస్‌ని మెప్పించలేకపోయింది. ఈ టాస్క్‌ నుంచి తప్పించుకునేందుకు రతిక, శివాజీ బాత్రూంలో దాక్కున్నారు. టాస్క్‌ అయిన తర్వాత బిగ్‌బాస్‌ పిలిస్తే బయటకు వచ్చారు. ‘ఇంప్రెస్‌ ద బిగ్‌బాస్‌’ టాస్కులో రతిక, శివాజీ విజేతలుగా నిలిచారని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే రతిక.. ఏం పనిచేయకపోయినా తనని బిగ్‌బాస్‌ ఎందుకు పొగుడుతున్నాడోనని షకీలా.. తోటి కంటెస్టెంట్స్‌కి చెప్పింది. మరోవైపు ప్రశాంత్‌.. తనకు అన్నలా(బ్రదర్‌) అనిపిస్తున్నాడని అతడితోనే చెప్పింది.

22.jpg

తేజాను భయపెట్టాలని ఫిక్స్‌ అయిన షకీలా.. తనకు పానిక్‌ ఎటాక్‌ వచ్చినట్లు యాక్ట్‌ చేసింది. దీంతో అందరూ ఆమెకు ఏమైంది ఏమైందని కంగారుపడ్డారు. ఆమె నిద్రపోతున్న సమయంలో పక్కనే ఉన్న తేజ.. ఒక్కసారిగా షకీలా ఉలిక్కిపడి లేచేసరికి గజగజా వణికిపోయాడు. తర్వాత తీరిగ్గా ఊరికనే.. తేజని భయపెట్టడానికే ఇలా చేశానని చెప్పుకొచ్చింది. అయితే ప్రశాంత్‌., రతిక మధ్య ట్రాక్‌ నడుస్తోందనే టాక్‌ ఉంది. దీనిపై రతిక క్లారిటీ ఇచ్చింది. వ్యక్తిగా పల్లవి అంటే ఇష్టమని, తనపై ఎలాంటి ఫీలింగ్స్‌ లేవని చెప్పుకొచ్చింది. ఇవన్నీ శుభశ్రీతో మాట్లాడుతూ బయటపెట్టింది.

‘ఫేస్‌ ద బీస్ట్‌’ టాస్కులో గెలిచిన ప్రియాంక, సందీప్‌తోపాటు ‘ఇంప్రెస్ట్‌ ద బిగ్‌బాస్‌’ టాస్కులో గెలిచిన రతిక, శివాజీ.. పవర్‌ అస్త్ర కోసం పోటీపడ్డారు. అయితే ఈ నలుగురిలో అర్హత లేనివారు చెప్పమని.. మిగతా 10 మంది హౌస్‌మేట్స్‌కి ఆర్డర్‌ వేశాడు. దీంతో రతికని.. శుభశ్రీ, దామిని, షకీలా, కిరణ్‌ రాథోడ్‌, శోభాశెట్టి, తేజ నామినేట్‌ చేశారు. శివాజీని అమర్‌దీప్‌, గౌతమ్‌ నామినేట్‌ చేశారు. ప్రియాంకని ప్రశాంత్‌, సందీప్‌ని ప్రిన్స్‌ నామినేట్‌ చేశారు. ఎలాగేతై ‘పవర్‌ అస్త్ర’ పోటీలోకి రతిక, శివాజీ వచ్చారో.. అలానే కంటెస్టెంట్స్‌ నామినేట్‌ చేయడంతో సైడ్‌ అయిపోయారు. అయితే ఇదంతా చూస్తుంటే రతికను బయటకు పంపించడానికి ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. దామిని అయితే ఓ రేంజ్‌లో రతికపై ఫైర్‌ అయింది. ‘‘నీకు అర్హత లేదు అనడానికి నా దగ్గర వంద రీజన్స్‌ ఉన్నాయి అంటూ నోరేసుకుని పడింది. అందుకు రతిక నోరు అదుపులో పెట్టుకో’’ అని హెచ్చరించింది.

Updated Date - 2023-09-09T11:08:16+05:30 IST