Biggboss 7 - Day 34 : తెలివితేటలు పరాకాష్టకు చేరాయి... నాగ్‌ ఏకిపారేశాడు!

ABN , First Publish Date - 2023-10-08T10:38:12+05:30 IST

బిగ్‌బాస్‌ షోలో వీకెండ్‌ వచ్చిందంటే ఒక సరదాతోపాటు టెన్షన్ ఉంటుంది. నాగార్జున వస్తారు... ఎంటర్‌టైన్ చేస్తారని ఒకటి, మరొకటి ఏం క్లాస్‌ పీకుతారో, ఎవర్ని ఎలిమినేట్‌ చేస్తారోననే భయం. దాని కోసమే ఐదు రోజుల ఆట ఆడి వారాంతంలో రిజల్ట్‌ కోసం, నాగార్జున మన్ననల కోసం ఎదురుచూస్తుంటారు.

Biggboss 7 - Day 34 : తెలివితేటలు పరాకాష్టకు చేరాయి... నాగ్‌ ఏకిపారేశాడు!

బిగ్‌బాస్‌(Biggboss 7) షోలో వీకెండ్‌ వచ్చిందంటే ఒక సరదాతోపాటు టెన్షన్ ఉంటుంది. నాగార్జున వస్తారు... ఎంటర్‌టైన్ చేస్తారని ఒకటి, మరొకటి ఏం క్లాస్‌ పీకుతారో, ఎవర్ని ఎలిమినేట్‌ చేస్తారోననే భయం. దాని కోసమే ఐదు రోజుల ఆట ఆడి వారాంతంలో రిజల్ట్‌ కోసం, నాగార్జున మన్ననల కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన 7 ఐదో వారం ఎలిమినేషన్ లో ఉంది. నాగార్జున రానే వచ్చారు. బాగా ఆడిన వాళ్లను పొగిడారు. ఆటలో కాస్త తేడాగా ఉండి, వ్యవహార శైలి బాగోని వాళ్లని నిలబెట్టి మరీ కడిగే ప్రయత్నం చేశారు. ఎలిమినేషన్‌ కంటే ముందు మరో ట్విస్ట్‌ ఇచ్చాడు. దీనితో నామినేషన్లో ఉన్న ముగ్గురికి టెన్షన్ పట్టుకుంది. అయితే శనివారంఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.

నాగ్‌ రావడమే శుక్రవారం ఏం జరిగింతో మన టీవీలోచూశారు. తదుపరి శనివారం వ్యవహారం మొదలైంది. షోలోకి ఎంటర్‌ కావడమే బెస్ట్‌ బడ్డీస్‌ ఎవరో జోడీలుగా కూర్చోమని ఆదేశించాడు. ఫస్ట్‌ ప్రియాంక-శోభాశెట్టిలను నిలబెట్టి ఈ వారం మీరేం తప్పులు చేశారు? మీకేం అన్యాయం జరిగిందనేది అడిగాడు. స్మైల్‌ టాస్కులో మూడోసారి గంట కొట్టింది తామే అయినా స్టార్స్‌ రాలేదని ప్రియాంక అంది. అయితే తన బడ్డీ శోభా ఆ గేమ్‌లో సంచాలక్‌ కావడం, మరో సంచాలక్‌ యావర్‌తో డిస్కస్‌ చేసి నిర్ణయం తీసుకోవడంతో తానేం మాట్లాడలేకపోయానని చెప్పింది. ఇదంతా విన్న నాగ్‌ పోటీలో ప్రతి ఒక్కరూ ఆడ సరిగ్గా ఆడలేదని, అంతా తప్పే ఆడారని తెలిపాడు. తేజ మాటిచ్చినట్టే ఎంటర్టైన్ చేస్తున్నాడని నాగార్జున కితాబిచ్చారు 

Untitled-1.gif

తొక్కలో సంచాలక్‌... బొక్కలో జడ్జిమెంట్‌...

కెప్టెన్సీ టాస్కులో గేమ్స్‌ ఆడుతూ ఎక్కువ తప్పులు చేసింది అమరదీప్‌-సందీప్‌. ఆ విషయాలు వ్యూవర్స్‌కి తెలిసినా ఆ తప్పులేంటో సందీప్‌-అమరదీప్‌తో చెప్పించాడు నాగ్‌. ఇద్దరికీ గట్టిగా క్లాస్‌ ఇచ్చేశాడు. సంచాలక్‌ నిర్ణయాన్ని బొక్కలో జడ్జిమెంట్‌ అని అమర్‌ అనడంపై నాగార్జున ఫైర్‌ అయ్యాడు. ‘నువ్వే తొక్కలే సంచాలక్‌.. నీదే బొక్కలో జడ్జిమెంట్‌’ అని అనడంతో అమర్‌ నోరు మెదపలేదు. ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరూ చేసిన తప్పులను ఎత్లి చూపాడు నాగార్జున. దాంతో అందరూ దొరికిపోయిన వాళ్లలాగా ఫేస్‌ పెట్టుకున్నారు. అందర్నీ ఓ రౌండ్‌ క్లాస్‌ పీకాడు. ఇదే సమయంలో శివాజీ మాట్లాడుతూ అమరదీప్‌కి ఏం చెప్పినా వినట్లేదని, ఇంట్లో ఎవరూ ఫెయిర్‌గా ఆట ఆడట్లేదని తన ఒపీనియన చెప్పాడు. దొంగ టాస్కులో అమరదీప్‌.. ప్రశాంత్‌ని ఉద్దేశిస్తూ రూంలో కూర్చుని ‘వాడు మేకప్‌ వేయకపోయినా దొంగలానే ఉంటాడు’ అని చెబుతున్న వీడియో స్ర్కీన్‌పై ప్లే చేసిన నాగ్‌.. అమర్‌ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ుమీ తెలివితేటలు పరాకాష్టకు చేరాయి. ఆటలో మాటిమాటికి బొక్కలో జడ్జిమెంట్‌ అన్నావ్‌.. ఇప్పుడు నేనూ అంటున్నా.. 'తొక్కలో సంచాలక్‌... బొక్కలో జడ్జిమెంట్‌= ఇప్పుడు అమర్‌పై ఇంట్లోనే కాదు బయట కూడా నెగటివిటీ పెరిగిపోయింది.

BB7.gif

ఈ చర్చ అంతా అయిన తర్వాత నాగ్‌ ఇంటి సభ్యులకు ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు. ఎలిమినేషన్‌ గురించి మాట్లాడకుఉండా ఈ హౌసులో ఉండటానికి అర్హత లేని ముగ్గురు పేర్లు చెప్పాలని ఇంటి సభ్యులతో అన్నాడు. హౌస్‌మేట్స్‌ శోభాశెట్టి, ప్రశాంత్‌, సందీప్‌ కాకుండా మిగిలిన ఏడుగురిలోని పేర్లు చెప్పాలని అన్నాడు. దీంతో అందరూ నామినేట్‌ చేసినోళ్ల పేర్లు, అందుకు గల కారణాలు తెలిపారు.

ఎవరు ఎవరు పేర్లు చెప్పారంటే..

శోభాశెట్టి - తేజ, గౌతమ్‌, శివాజీ

ప్రశాంత్‌ - యావర్‌, అమరదీప్‌, తేజ

సందీప్‌ - గౌతమ్‌, శివాజీ, యవర్‌

ప్రియాంక - గౌతమ్‌, శివాజీ, శుభశ్రీ,

అమరదీప్‌ - శుభశ్రీ, గౌతమ్‌, యావర్‌

శుభశ్రీ - తేజ, ప్రియాంక, అమరదీప్‌

గౌతమ్‌ - అమరదీప్‌, తేజ, ప్రియాంక,

శివాజీ - అమరదీప్‌, ప్రియాంక, గౌతమ్‌?

తేజ - గౌతమ్‌, అమరదీప్‌, శుభశ్రీ

యావర్‌ - అమరదీప్‌, ప్రియాంక, తేజ

హైస్‌మేట్స్‌ చెప్పిన దాని ప్రకారం అమరదీప్‌, తేజ, గౌతమ్‌ హౌసులో అనర్హత కలిగిన ముగ్గురుగా తేలింది. కానీ ప్రేక్షకుల ఓటింగ్‌ ప్రకారం ఈ ముగ్గురులో ఎవరు బయటికి వెళ్తారో ఆదివారం ఎపిసోడ్‌లో చూడాల్సిందే. ఆదివారం.. ఎవరూ ఊహించని విషయం చెబుతానని కంటెస్టెంట్స్‌ అందరితో అన్నాడు నాగ్‌. అయితే ఆదివారం ఆరుగురు కొత్త ఇంటి సభ్యులు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-10-08T10:55:52+05:30 IST