Bhramara: ‘భ్రమర’.. బ్రహ్మాండంగా ప్రారంభమైంది
ABN , First Publish Date - 2023-09-20T19:40:39+05:30 IST
జి.యం.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నికిత శ్రీ, 30 ఇయర్స్ పృథ్వీ, పృథ్వీ రాజ్(‘పెళ్లి’ ఫేమ్), నాగమహేష్, జయవాణి, మీసాల లక్ష్మణ్ తదితరులు తారాగణంగా.. టి.వి రవి నారాయణన్ దర్శకత్వంలో జి.మురళీ కృష్ణ నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకోబోతోన్న చిత్రం ‘భ్రమర’. వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కునున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
జి.యం.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ (GMK Entertainments) పతాకంపై నికిత శ్రీ, 30 ఇయర్స్ పృథ్వీ, పృథ్వీ రాజ్(‘పెళ్లి’ ఫేమ్), నాగమహేష్, జయవాణి, మీసాల లక్ష్మణ్ తదితరులు తారాగణంగా.. టి.వి రవి నారాయణన్ (TV Ravi Narayanan) దర్శకత్వంలో జి.మురళీ కృష్ణ నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకోబోతోన్న చిత్రం ‘భ్రమర’ (Bhramara). వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కునున్న ఈ చిత్రం.. బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత బెక్కం వేణుగోపాల్ చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, తెలంగాణ ఎఫ్.డి.సి. చైర్మన్ అనిల్ కుర్మాచలం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. (Bhramara Movie Launch)
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు టి.వి రవి నారాయణన్ మాట్లాడుతూ.. డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్ మీద ఈ సినిమా నడుస్తుంది. ఈ కథను చెప్పగానే.. ఎంతో నచ్చి నిర్మాతలు ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాను ఊటీ బ్యాక్ డ్రాప్‌లో చిత్రీకరించాలని అనుకున్నాం. అయితే ఊటీ కంటే అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని ఢిల్లీ, కొల్‌కత్తా, చిక్ మంగళూరులోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరించనున్నాం. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా రాహుల్ శ్రీ వాత్సవ్, మ్యూజిక్ డైరెక్టర్‌గా కార్తీక్ బి. కొడగండ్ల చేస్తున్నారు. ఇంపార్టెంట్ రోల్‌లో సీనియర్ నటులు 30 ఇయర్స్ పృథ్వీ, ‘పెళ్లి’ సినిమా ఫేమ్ పృథ్వీ రాజ్‌తో పాటు నికితశ్రీ లీడ్ రోల్‌లో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తాము. అందరూ బాగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. అక్టోబర్‌లో సెట్స్ మీదకు వెళ్తున్నాం. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథిగా హాజరైన హైకోర్ట్ అడ్వకేట్ సుంకర నరేష్, సహ నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి, నటి నికిత శ్రీ వంటి వారు మాట్లాడారు. (Bhramara Movie Opening Details)
ఇవి కూడా చదవండి:
============================
*Theppa Samudram: కాబోయేవాడు యాడున్నాడో.. మస్త్‌గా ఎక్కుతోన్న మంగ్లీ మాస్ బీట్ సాంగ్
*********************************
*Sai Pallavi: ఇలా తెలుగు ప్రేక్షకులను మళ్లీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది
*************************************
*King Nagarjuna: ఆవిష్కరించే వరకు నాన్న విగ్రహాన్ని చూడలేదు.. ఎందుకంటే?
**************************************
*Chandramukhi 2: సెప్టెంబర్ 28న రిలీజ్‌కు అంతా రెడీ..
***************************************