Bhagyashree: 'ప్రేమపావురాలు' హీరోయిన్ కూతురికి తెలుగులో ఎవరంటే ఇష్టమో తెలుసా....
ABN , First Publish Date - 2023-05-30T19:37:25+05:30 IST
'ప్రేమ పావురాలు' సినిమాతో ఒక సంచలనం సృష్టించిన నటీమణి భాగ్యశ్రీ. ఆమె కూతురు అవంతిక ఇప్పుడు తెలుగులో బెల్లంకొండ గణేష్ పక్కన 'నేను స్టూడెంట్ సర్' అనే సినిమాతో ఆరంగేట్రం చేస్తోంది. ఆమె సౌత్ సినిమా గురించి, తెలుగు సినిమాలు, ఆమెకి ఇష్టమైన నటీమణులు గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది
సల్మాన్ ఖాన్ (SalmanKhan), భాగ్యశ్రీ (Bhagyashree) నటించిన హిందీ సినిమా 'మై నే ప్యార్ కియా' (MainePyarKiya) సినిమా తెలుగులో 'ప్రేమ పావురాలు' (PremaPavuralu) పేరిట విడుదల అయింది. ఈ సినిమా సుమారు ఒక సంవత్సరం పాటు అప్పట్లో ఆడింది. ఇందులో పాటలు, భాగ్యశ్రీ, సల్మాన్ ఖాన్ ఈ మూడే ఈ సినిమా అన్ని రోజులు ఆడటానికి హెల్ప్ అయ్యాయి. ఇది 1989లో కథ, అప్పుడు భాగ్యశ్రీ ఒక సంచలనం.
ఇప్పుడు ఆ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని (AvantikaDasani) తెలుగులో బెల్లంకొండ గణేష్ (BellamkondaGanesh) పక్కన 'నేను స్టూడెంట్ సర్' (NenuStudentSir) అనే సినిమాతో ఆరంగేట్రం చేస్తోంది. దీనికి రాకేష్ ఉప్పలపాటి (RakeshUppalapati) దర్శకుడు, అతనికి కూడా ఇది మొదటి సినిమా. ఈ సినిమా జూన్ 2వ తేదీన విడుదల అవుతోంది. ఈ సినిమా గురించి అవంతిక కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఆమె ముందుగా 'మిథ్యా' (Mithya) అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ లోకి అడుగు పెట్టింది, ఆ తరువాత హిందీ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది అని చెప్పింది. ఇప్పుడు ‘నేను స్టూడెంట్ సర్'తో తెలుగులో పరిచయం కావడం చాలా ఎక్సయిటెడ్ గా వుంది అని చెప్తోంది.
ఈ ప్రాజెక్ట్ లోకి రావటం కూడా అంత అలా జరిగిపోయింది అని చెప్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ (BellamkondaSreenivas) హిందీ 'ఛత్రపతి' #Chatrapathi సినిమాలో అతని అమ్మగా భాగ్యశ్రీ వేశారు. "ఆలా ఈ కథ విని, బాగా నచ్చింది, ప్రత్యేకంగా ఇందులోని మలుపులు చాలా ఎక్సయిట్ చేశాయి," అని చెప్పింది అవంతిక. కమర్షియల్ సినిమా కాకుండా, ఇలా ఒక కంటెంట్ వున్న సినిమాతో పరిచయం అవటం చాల బాగుంది, ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమ కంటెంట్ వున్న సినిమాల వైపు చూస్తోంది అని చెప్తోంది. "నేను కూడా కథలో కీలకంగా ఉండే పాత్రలని చెయ్యడానికి ఇష్టపడతాను," అని చెప్పింది.
తెలుగు పరిశ్రమ గురించి మాట్లాడుతూ, సౌత్ ఇండస్ట్రీ అంటే వాళ్ళ అమ్మ భాగ్యశ్రీకి చాలా ఇష్టం, గౌరవం. ఆమెను ఎంతోగానో అభిమానించారు అలాగే ఇక్కడ పరిశ్రమలో అమ్మకు మంచి అవగాహన వుంది. అందుకని ఈ ప్రాజెక్ట్ గురించి సంప్రదించినప్పుడు, తెలుగులో లాంచ్ కావడానికి, ఇదే మంచి అవకాశమనిపించింది అని చెప్పింది. అయితే కథల ఎంపికలో అమ్మ ఇన్వాల్వ్ ఎవరు, కానీ అమ్మ దగ్గర సలహాలు మాత్రం తీసుకుంటానని అని చెప్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు శృతి అని చెప్పింది.
తెలుగు సినిమాలు కూడా చూస్తూ వుంటాను అని చెప్తోంది అవంతిక. 'పుష్ప' (Pushpa), 'అల వైకుంఠపురములో' (AlaVaikuntapuramlo) చిత్రాలలో అల్లు అర్జున్ (AlluArjun) గారు చాలా గొప్పగా చేశారు అని చెపుతూ ఆమెకి నటీమణులు సమంత (Samantha), నయనతార (Nayanthara) అంటే మాత్రం చాలా ఇష్టం అని చెప్పింది. తదుపరి సినిమాల గురించి చెపుతూ 'మిథ్యా' సీజన్ 2 వస్తోంది. అలాగే ఇంకో సినిమా 'యు షేప్ కి గల్లీ' షూటింగ్ పూర్తయింది అని చెప్పింది.