Bhagavanth Kesari: బాలయ్య ‘భగవంత్ కేసరి’ తాజా అప్డేట్
ABN , First Publish Date - 2023-07-31T23:32:34+05:30 IST
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సిలో జరుగుతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. ఇందులో ఓ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నట్లుగా తెలిపారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)ల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైయ్యే భారీ అంచనాల సినిమాలలో ఒకటి. ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సిలో వేసిన భారీ సెట్లో జరుగుతోంది. బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన తారాగణంపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రధాన తారాగణం అంతా కనిపించబోయే ఈ పాటను బిగ్ స్క్రీన్స్‌పై చూడటం కన్నుల పండువగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. (Bhagavanth Kesari Update)
‘భగవంత్ కేసరి’ యునిక్ కాన్సెప్ట్‌తో హై యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్లో అనిల్ రావిపూడి ప్రజంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టుకున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజన్స్, తెలంగాణ యాసలో డైలాగ్‌లని చెప్పడం ఎంతగానో అలరించింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆయన విలన్‌గా కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Navdeep: స్వామీ.. నదికి పోలేదా? అంటే.. ‘నదే సిటీకి వచ్చింది’ అంటూ ప్రభుత్వంపై పంచ్
**************************************
*S Thaman: సాయి తేజ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత బాధపడ్డానంటే..
**************************************
*Chandramukhi 2: రాజు వేషంలో లారెన్స్ ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే?
**************************************