Balagam: బండి సంజయ్ భార్య నోట 'బలగం' మాట

ABN , First Publish Date - 2023-04-06T13:52:40+05:30 IST

బండి సంజయ్ భార్య అపర్ణ 'బలగం' సినిమా గురించి ఈరోజు జరిగిన రాజకీయ ప్రెస్ మీట్ లో మాట్లాడేరు. ఇంతకీ ఎందుకు ఆమె ఆ సినిమా గురించి మాట్లాడేరు, ఏమి మాట్లాడేరు తెలియాలంటే...

Balagam: బండి సంజయ్ భార్య నోట 'బలగం' మాట

ఈమధ్య ఎక్కడ చూసినా 'బలగం' (Balagam) సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు (Dil Raju) అయితే, దర్శకుడు వేణు ఎల్దండి (Venu Yeldandi). దర్శకుడు ఇంతకు ముందు 'జబర్దస్త్' (Jabardasth) షో లో కమెడియన్ గా చేసేవాడు, అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. ఈ 'బలగం' (Balagam) సినిమా ఒక కుటుంబంలోని పెద్దాయన చనిపోతే ఆ కుటుంబం ఎలా అతన్ని సాగనంపుతుంది, ఆలా చేసినప్పుడు బావ, బావమరుదులు మధ్య వచ్చే ఇగో ప్రొబ్లెమ్స్ ఈ నేపధ్యం లో సాగే కుటుంబ విలువలు, అనుబంధాలు బాగా చూపించారు.

bandisanjaywifeaparna.jpg

ఇంతకీ ఈ సినిమా గురించి ఎందుకు ఇంతగా చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు బీజేపీ (BJP Telangana) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అరెస్టు అయ్యాడు కదా, అతని భార్య అపర్ణ (Bandi Sanjay wife Aparna) ఈరోజు అతన్ని కలిసి బయటకు వచ్చాక మీడియా వాళ్ళతో మాట్లాడింది. అందులో బండి సంజయ్ (Bandi Sanjay Arrested) ని కలిసాక ఏమి చెప్పాడు, కార్యకర్తలకి ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు అన్న విషయాలమీద అపర్ణ మాట్లాడింది.

ఆమె మాటల్లో చెప్పాలంటే, బండి సంజయ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పమన్నారు అని చెపుతూ ప్రతి కార్యకర్త 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) గారి సభ పరేడ్ గ్రౌండ్స్ లో అవుతుంది, విజయవంతం చెయ్యమన్నారు అని చెప్పారు అపర్ణ. అలాగే పోలీసుల తీరు పట్ల ఆమె మాట్లాడుతూ, తల్లి గారి సెరిమోనీ అవుతుంటే, ఇంత దారుణంగా టెంట్ ని కూల్చేసి, అక్కడ ఫోటో వుంది, కుర్చీలు వున్నాయి, ఇంట్లో సామాను ని ధ్వంసం చేసి, తీసుకుపోయే విధానం నచ్చలేదు అని చెప్పారు.

dilraju-balagam.jpg

రాజకీయాలు ఎప్పుడూ ఇంటి బయటే ఉండాలి, ఇంట్లోకి రాకూడదు అని సంజయ్ గారు చెపుతూ ఉండేవారు, మేము ఎదో బయపడతాం అని కాదు, పిల్లలు ముందు ఇలాంటివి చేస్తే వాళ్ళు భయపడతారు అని అంటూ, "ఈమధ్య వచ్చిన 'బలగం' చూపిస్తే బాగుండేది, వాళ్ళకి కొంచెం ఎమోషన్స్ డెవలప్ అయ్యేవి, అని సంజయ్ గారు చెప్పారు అని అపర్ణ అన్నారు. ఆలా ఈ 'బలగం' సినిమా ఎంతగా ప్రేక్షకుల ఆదరణ పొందిందో తెలుస్తోంది.

Updated Date - 2023-04-06T14:05:16+05:30 IST