Bala Krishna: బాలయ్య ధైర్యాన్ని మెచ్చుకోవాలంటున్నారు!

ABN , First Publish Date - 2023-08-04T21:17:02+05:30 IST

‘అఖండ’ సక్సెస్‌, 'అన్‌ స్టాపబుల్‌' షోతో బాలకృష్ణ (Bala krishna)లెక్కలే మారిపోయాయి. ఆయన ఫ్యాన్‌ బేస్‌ రెట్టింపు అయింది. జోష్‌ పెరిగింది. పారితోషికం విషయంలోనూ బాలయ్య హైలోనే ఉన్నారట. ఇప్పుడు ఆయనతో భారీ విజయాలు అందుకున్న పెద్ద దర్శకుడు, యువ దర్శకులు కూడా సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు.

Bala Krishna: బాలయ్య ధైర్యాన్ని మెచ్చుకోవాలంటున్నారు!

‘అఖండ’ సక్సెస్‌, 'అన్‌ స్టాపబుల్‌' షోతో బాలకృష్ణ (Bala krishna)లెక్కలే మారిపోయాయి. ఆయన ఫ్యాన్‌ బేస్‌ రెట్టింపు అయింది. జోష్‌ పెరిగింది. పారితోషికం విషయంలోనూ బాలయ్య హైలోనే ఉన్నారట. ఇప్పుడు ఆయనతో భారీ విజయాలు అందుకున్న పెద్ద దర్శకుడు, యువ దర్శకులు కూడా సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో బాలయ్య ఆయనకు ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహ నాయుడు’ వంటి బ్లాక్‌బస్టర్‌ వి ఇచ్చిన సీనియర్‌ దర్శకుడు బి.గోపాల్‌తో (B Gopal) ఓ సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. అయితే ఆయనతో సినిమా చేస్తానని గతంలోనే బాలయ్య మాటిచ్చారు. అయితే కొత్తతరం హవా నడుస్తున్న తరుణంలో బాలయ్య బి.గోపాల్‌తో సినిమా చేయడం రిస్కే అని భావిస్తున్నారు నెటిజన్లు. బి.గోపాల్‌ ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే!

2021లో వచ్చిన ‘ఆరడుగుల బుల్లెట్‌’ చిత్రం తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. ఓ మంచి సినిమా తీసి రిటైర్‌ అవ్వాలని గోపాల్‌ కోరిక. ఇదే విషయాన్ని బాలయ్య దగ్గరా బయట పెట్టాడు. గోపాల్‌తో ఉన్న అనుబంధం, ఎన్నో హిట్లే ఇచ్చారనే కృతజ్ఞతతో బాలకృష్ణ గోపాల్‌లో సినిమాకు సై అన్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చుతుందని తెలిసింది. ఓ టీమ్‌ని సెట్‌ చేసుకుని బి.గోపాల్‌ బాలకృష్ణ స్టార్‌డమ్‌కు తగిన కథ సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇలాంటి తరుణంలో బాలయ్య ఈ చిత్రం చేయాలనుకోవడం రిస్క్‌ అయినా ఆయన ధైర్యాని మెచ్చుకోవలసిందే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇవన్నీ పూర్తయ్యాక బి.గోపాల్‌ సినిమా చేస్తారని టాక్‌.

Updated Date - 2023-08-04T21:17:35+05:30 IST