కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jr Ntr: బాబాయ్‌ అబ్బాయ్‌ చేయి కలిపిన వేళ.. ఏం జరిగింది అంటే!

ABN, First Publish Date - 2023-08-21T12:26:42+05:30

దివంగత మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna)కుమార్తె నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ పెళ్లి వేడుకకు నందమూరి, నారా కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

దివంగత మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna)కుమార్తె నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ పెళ్లి వేడుకకు నందమూరి, నారా కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. తారక్‌ (Tarak) కల్యాణ్‌రామ్‌(kalyan ram), మోక్షజ్ఞ (mokshagna) కలిసి దిగిన ఫొటో పెళ్లి ఫొటోల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ఒకే ఫ్రేమ్‌లో నందమూరి బ్రదర్స్‌’ అంటూ అభిమానులు సంబరపడుతున్నారు. దీనితోపాటు మరో వీడియో విపరీతంగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నందమూరి బాలకృష్ణ వేదిక ముందు కూర్చుని అతిథులతో సంభాషిస్తుండగా జూ.ఎన్టీఆర్‌ బాబాయ్‌ బాలయ్యకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి పలకరించారు. బాలయ్య మాత్రం అంతగా స్పందించినట్లు కనిపించలేదు. దాంతో తారక్‌ మిగిలిన వాళ్లను రిసీవ్‌ చేసుకునే పనిలో పడ్డారు. కొన్ని నెలల క్రితం నందమూరి తారకరత్న సంస్మరణ కార్యక్రమంలోనూ ఇదే జరిగింది. తారకరత్నకు నివాళులు అర్పించడానికి వచ్చిన తారక్‌ తన బాబాయ్‌ బాలకృష్ణను చూసి నిలబడి నమస్కారం చేశారు. ఆయన చూసీచూడనట్లు వెళ్లిపోయారనే కామెంట్లు వినిపించాయి. తాజాగా సుహాసిని కుమారుడి వివాహ వేడుకలోనూ అదే రిపీట్‌ అయింది. తాజా వీడియో చూసిన నెటిజన్లు బాబాయ్‌కి, అబ్బాయ్‌కి మధ్య ఏదో గ్యాప్‌ ఉన్నట్లుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-21T14:14:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!