Baby: బోరున ఏడ్చేసిన 'బేబీ' హీరోయిన్

ABN , First Publish Date - 2023-07-13T10:56:37+05:30 IST

ఢిల్లీ, ముంబై, కన్నడ, తమిళం, మలయాళం పరిశ్రమల నుండి నటీమణులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న తెలుగు దర్శకులు, నిర్మాతలలా కాకుండా, దర్శకుడు సాయి రాజేష్ ఒక తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వాలని వైష్ణవి చైతన్య అనే ఆమెని పరిచయం చేస్తున్నాడు తన 'బేబీ' అనే సినిమా ద్వారా. అతను ఇచ్చిన ఆ అవకాశానికి ఆమె బోరున ఏడవటమే కాకుండా ఇంకేమందో తెలుసా...

Baby: బోరున ఏడ్చేసిన 'బేబీ' హీరోయిన్
Vaishnavi Chaitanya at the Baby film promotions

'బేబీ' #Baby సినిమా ప్రచారాలు చివరికి వచ్చేసాయి. ఎందుకంటే ఆ సినిమా ఈనెల 14న అంటే రేపు శుక్రవారం విడుదల అవుతోంది. సాయి రాజేష్ (SaiRajesh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, ఆనంద్ దేవరకొండ (AnandDeverakonda), వైష్ణవి చైతన్య (VaishnaviChaitanya), విరాజ్ అశ్విన్ (VirajAshwin) ఇందులో ప్రముఖ తారాగణం. ఎస్కెఎన్ (SKN) అని అందరూ ముద్దుగా పిలుచుకునే శ్రీనివాస్ (Sreenivas) దీనికి నిర్మాత. 'బేబీ' కార్నివాల్ అని నిన్న ఒక ప్రచార ఈవెంట్ పెట్టారు ఈ చిత్ర నిర్వాహకులు. ఈ సినిమా యూనిట్ సభ్యులు అందరూ వచ్చారు దీనికి. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు అందరూ ఈ సినిమా గురించి మాట్లాడేరు.

vaishnavichaitanya1.jpg

ఈ ఈవెంట్ లో అందరూ ఈ సినిమా గురించి మాట్లాడేరు, కానీ ఈ సినిమాలో నటించిన కథానాయకురాలు వైష్ణవి చైతన్య (VaishnaviChaitanya) మాట్లాడినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యారు. స్టేజి పైనే పాపం బోరున ఏడ్చేసింది. ఇదేదో కష్ఠాలుతో వచ్చిన ఏడుపు కాదు, ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. ఎందుకంటే మన తెలుగు దర్శకులు కానీ, నిర్మాతలు కానీ తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వడమే అరుదు, అందులోకి కథానాయకురాలిగా ఈ 'బేబీ' సినిమాలో ఒక తెలుగు అమ్మాయికి దర్శకుడు సాయి రాజేష్ అవకాశం ఇచ్చాడు. అది అందరూ హర్షించదగింది, అందుకే ఆ అమ్మాయి స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకుంది.

"నేను ఏవో చిన్న చిన్న క్యారెక్టర్ పాత్రలు వేసాను, యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేసాను అలంటి నాకు 'బేబీ' సినిమా నుండి కాల్ రాగానే అసలు ఏమవుతుందో కూడా అర్థం కాలేదు. అసలు అంత పెద్ద పాత్ర నేను చేయగలనా, చెయ్యలేనా అని నాకే అనిపించింది. ఇదంతా ఒక కొత్త ప్రపంచం, ఈ 'బేబీ' సినిమాతో ఇంకోక జర్నీ మొదలెట్టారు. నాకు వెన్నుతట్టి, భయం లేదని చెప్పి, ప్రోత్సహించి, నువ్వు ఈ పాత్ర చెయ్యగలవ్ అని చెప్పిన దర్శకుడు సాయి రాజేష్ గారికి ఎంత చెప్పినా తక్కువే," అని చెప్పింది వైష్ణవి చైతన్య.

vaishnavichaitanya2.jpg

తల్లిదండ్రులు జన్మ ఇచ్చారు, కానీ దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాతో నాకు ఇంకో జన్మ ఇచ్చారు అని ఆమె దర్శకుడికి చెప్పింది. అలాగే నిర్మాత ఎస్కెఎన్ కి కూడా తన ధన్యవాదాలు చెప్పుకుంది. ఇన్ని వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోస్ చేసాను కానీ ఈ సినిమాలో నన్ను నేను చూసేసరికి నేను ఇంత అందంగా ఉన్నానా అన్నంత బాగా చూపించారు నన్ను అని చెప్పింది వైష్ణవి.

Updated Date - 2023-07-13T10:56:37+05:30 IST