A R Murugadas: బన్నీతో సినిమా..మురుగదాస్ ఏమన్నారంటే

ABN , First Publish Date - 2023-04-01T19:56:05+05:30 IST

ఏ.ఆర్‌.మురుగదాస్‌ తమిళనాట స్టార్‌ డైరెక్టర్‌. రజనీకాంత్‌ ‘దర్బార్‌’ చిత్రం తర్వాత ఆయన కొంత గ్యాప్‌ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాతగా గౌతమ్‌ కార్తిక్‌ హీరోగా ‘16 ఆగస్టు 1947’ చిత్రాన్ని తెరకెక్కించారు.

A R Murugadas: బన్నీతో సినిమా..మురుగదాస్ ఏమన్నారంటే

ఏ.ఆర్‌.మురుగదాస్‌ (A r MUrugadas) తమిళనాట స్టార్‌ డైరెక్టర్‌. రజనీకాంత్‌ ‘దర్బార్‌’ చిత్రం తర్వాత ఆయన కొంత గ్యాప్‌ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాతగా గౌతమ్‌ కార్తిక్‌ (gowtham karthik) హీరోగా ‘16 ఆగస్టు 1947’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్‌.ఎస్‌ పొన్‌కుమార్‌ దర్శకుడు. సినిమా ప్రచారంలో భాగంగా మురుగదాస్‌ హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. తదుపరి చిత్రాలపై క్లారిటీ ఇచ్చారు. ఎప్పటి నుంచో ఆయన అల్లు అర్జున్‌(allu Arjun) తో సినిమా చేయాలనుకుంటున్నారు. అయితే ఆయన పరోక్షంగా ఆ చిత్రం గురించి మాట్లాడారు.

‘కరోనా కారణంగా అందరికీ గ్యాప్‌ వచ్చింది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుని పుస్తకాలు చదవడం మొదలుపెట్టా. అందుకే కాస్త సినిమాలకు గ్యాప్‌ ఇచ్చారు. పుస్తక పఠనం వల్ల చాలా తెలిసింది, కొత్త కొత్త ఆలోచనలు వచ్చాయి. ఆ దిశలోనే రాబోయే చిత్రాలుంటాయి. ఓ దర్శకుడు తన కెరీర్‌లో చాలామంది హీరోలను కలుస్తుంటాడు. అలాగే హీరో కూడా చాలామంది దర్శకులతో చర్చలు జరుపుతాడు. ఆలోచనలు కలిసినప్పుడు ప్రాజెక్ట్‌ మొదలువుతుంది. అలా నేను అనుకున్న ఓ కథ ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది. ఇంతకు మించి ఆ ప్రాజెక్ట్‌ గురించి చెబితే రకరకాల హెడ్డింగులతో వార్తలొస్తాయి. తెలుగులో కచ్చితంగా సినిమా చేస్తా. ప్రేక్షకుడి అంచనాలు, దర్శకుచి? క్రియేటివిటీ కలిేస్త ఆ సినిమా కచ్చితంగా హిట్టవుతుంది’’ అని అన్నారు. దీని బట్టి అల్లు అర్జున్‌తో చేయాలనుకున్న ప్రాజెక్ట్‌ అలాగే ఉందని తెలుస్తోంది.

ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘16 ఆగస్టు 1947’(16 august 1947) గురించి చెబుతూ ‘‘‘ఠాగూర్‌’ నుంచి మధు, ప్రసాద్‌లతో మంచి పరిచయం ఉంది. కలిసి సినిమాలు చేశాం. ఈ సిననిమాను 20 రోజుల కింద వారు చూశారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తే ఆ ఫ్లేవర్‌, మ్యాజిక్‌ పోతుంది. ఇప్పుడు ఓటీటీలు విపరీతంగా అందుబాటులో ఉన్నాయి. పరభాష చిత్రాలు సబ్‌ టైటిల్స్‌తో అందుబాటులో ఉంటున్నాయి. అందుకే ఈ సినిమాను తెలుగులో అనువదించాం’’ అని అన్నారు. అని మురుగదాస్‌ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-04-02T12:40:11+05:30 IST