TIllu Square: అనుపమ అదిరింది, ఈసారి కూడా సిద్ధూ వదల్లేదుగా...
ABN , First Publish Date - 2023-07-26T16:55:51+05:30 IST
సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' కి సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' అనే సినిమాతో వస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక కాగా మల్లిక్ రామ్ దర్శకుడు. ఈరోజు ఈ సినిమాలోంచి పాటను విడుదల చేశారు.
సిద్దు జొన్నలగడ్డ (SiddhuJonnalagadda) 'డీజే టిల్లు' #DJTillu సినిమాతో బాగా పాపులర్ అవడమే కాకుండా, స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు కూడా. డీజే టిల్లు అనే పాత్ర సృష్టించి, అందులో నటించిన సిద్ధు నిజంగా డీజే టిల్లు అనేవాడు ఒకడున్నాడేమో అనుకునేంతగా చేసాడు ఆ సినిమాతో. అందుకనే ఆ సినిమాకి సీక్వెల్ లా ఇప్పుడు మళ్ళీ 'టిల్లు స్క్వేర్' #TilluSquare అనే సినిమాతో వస్తున్నాడు సిద్దు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా, ఇందులో మొదటి పాటని ఈరోజు విడుదల చేశారు.
'డీజే టిల్లు' సినిమా పూర్తిగా వినోదంగా తీశారు, అలాగే చిన్న క్రైమ్ ఎలిమెంట్ కూడా పెట్టారు. సిద్ధూ చేస్తున్న సినిమా అంటే చాలు అందులో కొంచెం అడల్ట్ జోక్స్ ఉంటూ వస్తున్నాయి. 'డీజే టిల్లు' చేసిన కథానాయకురాలు కాకుండా, ఈ 'టిల్లు స్క్వేర్' సినిమాలో కథానాయకురాలు మారింది, ఇందులో అనుపమ పరమేశ్వరన్ (AnupamaParameshwaran) చేస్తోంది. మొదటి ఎవరినో అనుకున్నారు కానీ ఫైనల్ గా అనుపమ ఇందులో చేస్తోంది.
సినిమాలో అడల్ట్ జోక్స్ ఎలా వుంటాయో, సినిమాలో కథానాయకురాలిని కూడా అంతే సౌందర్యంగా చూపించటంలో సిద్ధు సిద్ధహస్తుడు. ఇవాళ విడుదలైన పాటలో అనుపమ పరమేశ్వరన్ అయితే చాలా అందంగా ఉండటమే కాకుండా, చాలా సౌందర్యంగా కూడా వుంది. ఆమె గతంలో చేసిన సినిమాలకు ఇందులో చాలా భిన్నంగా కనిపించే అవకాశాం వుంది ఈ పాటలో ఆమెని చూస్తుంటే, ఆమె చాలా గ్లామరస్ గా కూడా ఇందులో కనిపించనున్నదని అర్థం అవుతోంది. సాంగ్ ప్రోమోలో ఆమె లుక్ మరియు టిల్లుతో ఆమె సంభాషణ వైరల్‌గా మారాయి.
ఈసారి సిద్దు జొన్నలగడ్డను టిల్లుగా చేసే అల్లరి మొదటి దానికి రెట్టింపు ఉంటుందని చిత్ర నిర్వాహకులు ఇప్పటికే హామీ ఇచ్చారు. సూర్యదేవర నాగ వంశీ (SuryadevaraNagaVamsi) ఈ సినిమాకి సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. 'డీజే టిల్లు' చిత్రం మ్యూజికల్ హిట్ కూడా అయింది, ముఖ్యంగా, రామ్ మిరియాల (RamMiriyala) స్వరపరిచి, పాడిన "టిల్లు అన్న డీజే పెడితే" పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి, అది టిల్లు పాత్రకు గుర్తింపుగా మారింది. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' కోసం కూడా రామ్ మిరియాల, సరికొత్త పాటను స్వరపరచి ఆలపించారు.
ఈ పాట ఈరోజు విడుదలైంది. మాస్ బీట్స్ తో కాలు కదిపేలా హుషారుగా సాగిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. "టిల్లు అన్న డీజే పెడితే" పాట లాగానే, "టికెట్ ఏ కొనకుండా" పాట కూడా ముందు పాటలా మంచి హిట్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. పబ్‌లో మరొక అమ్మాయిని కలిసి, ప్రేమించి మళ్ళీ అవే తప్పులు పునరావృతం చేయకుండా టిల్లును హెచ్చరిస్తున్నట్లుగా సాగింది.