Anasuya: అల్లు అర్జున్‌ని నేనలా అనలేదు.. అనసూయ
ABN , First Publish Date - 2023-11-07T21:41:13+05:30 IST
యాంకర్ అనసూయ కేరీర్ ఆరంభం నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నది. ఆమె ఎక్కడ మాట్లాడినా ఎక్కడో ఏదో విషయంలో అడ్డంగా బుక్ అవుతూ ఉంటుంది. తాజాగా ఇటీవల ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూతో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది.
యాంకర్ అనసూయ (anasuya bharadwaj) కేరీర్ ఆరంభం నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నది. ఆమె ఎక్కడ మాట్లాడినా ఎక్కడో ఏదో విషయంలో అడ్డంగా బుక్ అవుతూ ఉంటుంది. తాజాగా ఇటీవల ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూతో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. టీవీ నుంచి సిల్వర్‌స్క్రీన్‌కు ఆప్‌గ్రేడ్ అయిన అనసూయ అనతి కాలంలోనే వినూత్న పాత్రలు పోషిస్తూ బిజీ అవుతూ వస్తున్నది. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం, పుష్ఫ’ సినిమాలతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తమిళంలోనూ కొన్ని సినిమాల్లోను నటించింది.
ఇదిలాఉండగా ఈ మధ్య సినిమాలతో కాకుండా తన సోషల్‌మీడియా పోస్టులు, సెటైర్లతో ట్రెండింగ్‌లో ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో ఆమె ఈ మధ్య ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలో ‘అల్లు అర్జున్ సామాజిక మాధ్యమాల్లో తన డ్యాన్స్ గురించి ఫ్యాన్స్ ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుని తన అప్‌కమింగ్ సినిమాలలో సరి చేసుకుంటాడని, అదేక్రమంలో పుష్ప సినిమాలో కొన్ని మిస్టేక్స్ చేశాడని ఇప్పుడు ‘పుష్ఫ2’ (Pushpa2 The Rule)లో అలా జరగకుండా చూసుకుంటున్నాడని’ ఆమె చెప్పినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి.
ఈవిషయం అనసూయ వరకు వెళ్లడంతో ఆమె స్పందించింది. నేను అల్లు అర్జున్ (Allu Arjun)ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని నేను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఫైర్ అయ్యింది. ఇప్పుడు ఈ వార్తలు నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచాయి. చూడాలి ఈ న్యూస్ ఎంత దూరం వెళుతుందో, ఎన్ని పంచాయితీలకు దారి తీస్తుందో.