Anasuya: అలసిపోయా... ఇక పోరాటం చేయలేను!
ABN , First Publish Date - 2023-06-11T13:05:07+05:30 IST
భర్తతో సరసాలు, లిప్‌లాక్, హగ్, బీచ్‌లో ఆటలు.. ఈ తరహా ఫొటోలతో నాలుగైదు రోజులు సోషల్ మీడియాను షేక్ చేసింది అనసూయ (Anasuya) భరద్వాజ్. విహారం అనంతరం ఫైనల్ టచ్‌గా ఓ వీడియో షేర్ చేసి ‘అందరి కళ్లూ నాపైనే’ అని కామెంట్ చేశారు అను. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
భర్తతో సరసాలు, లిప్‌లాక్(Anasuya liplock), హగ్, బీచ్‌లో ఆటలు.. ఈ తరహా ఫొటోలతో నాలుగైదు రోజులు సోషల్ మీడియాను షేక్ చేసింది అనసూయ (Anasuya) భరద్వాజ్. తన హాట్‌హాట్ ఫొటోలతో కుర్రకారకి నిద్ర లేకుండా చేసింది. భర్తతో థాయ్‌ల్యాండ్ విహారం ముగించుకుని ఇటీవల హైదరాబాద్‌కి తిరిగొచ్చారు. తన తాజా చిత్రం ‘విమానం’(Vimanam) ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు. అయితే విహారం అనంతరం ఫైనల్ టచ్‌గా ఓ వీడియో షేర్ చేసి ‘అందరి కళ్లూ నాపైనే’ (All eyes on me) అని కామెంట్ చేశారు అను. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
అందుకు కారణం లేకపోలేదు.. తాజాగా అనసూయ చేసిన పోస్ట్‌లు చర్చనీయాంశమయ్యాయి. పెళ్లిరోజు సెలబ్రేషన్ కోసం విహారానికి వెళ్లిన ఆమె బికినీ ధరించి హద్దులు మీరి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాటిని చూసిన నెటిజన్లు విపరీతంగా అనసూయను ట్రోల్ చేశారు. ఆమెను అభిమానించే వారైతే పెళ్లి రోజు అనేది మీ వ్యక్తిగత విషయం.. మీ ఎంజాయ్మెంట్ను ఫొటోల రూపంలో ఇలా బయట పెట్టడం చేయడం అంత మంచిది కాదేమో’ అని సలహాలు ఇచ్చారు. కొందరైతే అనసూయ గ్లామర్ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని, నెటిజను ్లకూడా హద్దు మీరి మాట్లాడారు. అందుకే ‘అందరి కళ్లూ నాపైనే’ అని అనసూయ కామెంట్ చేశారని అంటున్నారు.
మరో విషయం ఏంటంటే... ‘అర్జున్ రెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుక నుంచి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, అనసూయకు మధ్య జరుగుతున్న వార్‌కు ఆమె ఫుల్స్టాప్ పెట్టారు. ‘‘కావాలనే పెయిడ్ ట్రోలర్స్ నాపై దాడి చేస్తున్నారు. అలా ఎవరు చేయిస్తున్నారో కూడా నాకు తెలుసు. కావాలనే అలా చేస్తున్నారని తెలిసి, ఓ మహిళను ఇంతగా అవమానిస్తారా అని కోపంతో కూడిన బాధ వచ్చింది. మానసిక ప్రశాంతత కోసం ఇక ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలనుకుంటున్నా. చాలాసార్లు ఈ విషయంపై విజయ్‌తో మాట్లాడాలని ట్రై చేశా కానీ కుదరలేదు’’ అని అన్నారు.