Anasuya Bharadwaj : భర్త గురించి అనసూయ ఎమోషనల్ పోస్ట్.. అంతా ఓకేగానీ మరీ ఈ రేంజ్‌లో రెచ్చిపోవాలా..!

ABN , First Publish Date - 2023-06-04T21:49:36+05:30 IST

బుల్లితెరపై హాట్‌ యాంకర్‌గా గుర్తింపు పొందింది అనసూయ. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి థాయ్‌లాండ్‌ విహారానికి వెళ్ళింది. ఈ జంట అక్కడ ఓ బీచ్‌తో సేద తీరుతున్నారు. వైట్‌ కలర్‌ టూ పీస్‌ డ్రెస్‌ ధరించి బీచ్‌ ఒడ్డున అందాలు ఆరబోస్తూ తన భర్తతో ఎంజాయ్‌ చేస్తోంది.

Anasuya Bharadwaj : భర్త గురించి అనసూయ ఎమోషనల్ పోస్ట్.. అంతా ఓకేగానీ మరీ ఈ రేంజ్‌లో రెచ్చిపోవాలా..!

బుల్లితెరపై హాట్‌ యాంకర్‌గా (Anasuya) గుర్తింపు పొందింది అనసూయ. ఆమెకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా సినిమాలతోనూ బిజీ అయింది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అప్పుడప్పుడూ వివాదాల్లో కూడా ఇరుక్కుంటుంది. ఆదివారం అనసూయ పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్తతో కలిసి థాయ్‌లాండ్‌ విహారానికి వెళ్ళింది. ఈ జంట అక్కడ ఓ బీచ్‌తో సేద తీరుతున్నారు. వైట్‌ కలర్‌ టూ పీస్‌ డ్రెస్‌ ధరించి బీచ్‌ ఒడ్డున అందాలు ఆరబోస్తూ తన భర్తతో ఎంజాయ్‌ చేస్తోంది. ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. అంతే కాదు భర్త గురించి ఓ ఎమోషన్‌ పోస్ట్‌ కూడా పెట్టింది. భర్త భరద్వాజ్‌ గురించి ప్రేమ, పెళ్లి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. (anchor anasuya Hot photos)

‘‘2001 జనవరి 23న ఢిల్లీలో ఓ ఆడిటోరియంలో నువ్వు నాకోసం రాసిన మొదటి ప్రేమలేఖ నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు నీకు సరైన జవాబు ఇవ్వలేకపోయాను. అందుకే ఇప్పుడు నీపై నాకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాను. ఇన్నేళ్ల మన జీవితంలో ఎంతోమంది నిన్ను ఎన్నో మాటలు అన్నారు. వాటిని పట్టించుకోకుండా నాపై ఇంత ప్రేమ చూపుతున్నావు. మన ఇద్దరి మధ్య బంధాన్ని నిలబెడుతున్నావు. మనమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటూ పైకి ఎదుగుతున్నాం. నా కోసం ఎంతో త్యాగం చేశావు. ఎంత విసిగించినా ఒక్కోసారి నువ్వు నాపై చూపించే ప్రేమకు, నీ సహనానికి ఆశ్చర్యపోతుంటాను. నన్ను ఎలా బరిస్తున్నావో నాకే అర్థం కాదు. నేను కూడా అంతే అనుకో! మనం పర్‌ఫెక్ట్‌ కపుల్‌ కాదని నాకు తెలుసు. కానీ కష్టసుఖాల్లో ఒకరికొకరం తోడుంటున్నాం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఒక్కటిగా ముందుకు సాగుతున్నాం. నన్ను నన్నుగా నీ జీవితంలోకి స్వాగతించినందుకు థ్యాంక్స్‌ నిక్కు’’ అంటూ భర్తపై ఉన్న ప్రేమను వ్యక్త పరిచింది అనసూయ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. కొందరు అనసూయకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ, లైవ్‌బర్డ్స్‌, లవ్‌ బర్డ్స్‌ అంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఎప్పటిలాగే ట్రోల్‌ చేస్తున్నారు. (Anasuya Emotional post on husbend)

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాని తిట్టి తిట్టి ఇప్పుడు విజయ్‌ని కూడా టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు. ఎవరన్నా అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు పోస్ట్‌ చేస్తే వాళ్లని ఒక రేంజ్‌లో ఆడుకుంటారు. మీరు ఎలాంటి ఫొటోలైనా పెట్టొచ్చా. మీకు ఒక్కరికే ఆ హక్కులు ఉన్నాయా? అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మరి అనసూయ ఈ కామెంట్‌లకు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Updated Date - 2023-06-04T22:07:41+05:30 IST