Anasuya Bharadwaj : దానికి శారీరకంగా మానసికంగా చాలా ప్రిపేర్ అవ్వాలి!
ABN , First Publish Date - 2023-10-30T12:23:26+05:30 IST
అనసూయ టీవీ యాంకర్‌గా ఎంత ఫేమస్ అయిందో.. ప్రస్తుతం సినిమాల్లో ఆమె ఎంచుకున్న పాత్రలతోనూ అంతే పాపులర్ అయింది. ప్రస్తుతం. టీవీతోపాటు సినిమాలతోనూ బాగా బిజీగా గడుపుతోంది. క్యారెక్టర్ల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంది. ఇక ఆమె ఫైర్ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే! సోషల్ మీడియాలో ఆమె పోస్ట్‌ల వల్ల ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది.
అనసూయ (Anasuya) టీవీ యాంకర్‌గా ఎంత ఫేమస్ అయిందో.. ప్రస్తుతం సినిమాల్లో ఆమె ఎంచుకున్న పాత్రలతోనూ అంతే పాపులర్ అయింది. ప్రస్తుతం. టీవీతోపాటు సినిమాలతోనూ బాగా బిజీగా గడుపుతోంది. క్యారెక్టర్ల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంది. ఇక ఆమె ఫైర్ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే! సోషల్ మీడియాలో ఆమె పోస్ట్‌ల వల్ల ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ట్రోలింగ్, మీమ్స్ అంటారా లెక్కలేనని. అయితే వీటిపై పెద్ద దృష్టి పెట్టదు అనసూయ. సమయం వచ్చినప్పుడు మాత్రం దీటుగా సమాధానం చెబుతుంది. తాజాగా మరోసారి నెటిజన్లకు టార్గెట్ అయింది అనసూయ. ఓ టీవీ ఛానల్‌లో జరిగే అవార్డ్ ఫంక్షన్ లో భాగంగా ఓ పెర్ఫార్మెన్స్ కోసం అనసూయ మహానటి సావిత్రి గెటప్ వేశారు. అంతే కాదు.. జమున, శ్రీదేవి, సౌందర్య లాగా కూడా కనిపించింది. గతంలో వారు నటించిన పాటలకు అనసూయ డాన్స్ చేసినట్టుగా ఆ ఫొటోలు చూస్తే తెలుస్తోంది. ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో షేర్ చేసి ‘‘సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య పాత్రలకు పెర్‌ఫార్మ్ చేసే అవకాశం నాకు దక్కడం అదృష్టం. ఇదొక చిన్న ట్రిబ్యూట్‌లా ఉంటుంది’’ అని ట్వీట్‌లో పేర్కొంది. ఆ ఫొటోలు చూసి చాలామంది పాజిటివ్‌గా స్పందించారు. అచ్చం సావిత్రి గారిలా ఉన్నారు’’ అంటూ కామెంట్స్ చేశారు. ఓ నెటిజన అయితే ‘ఎక్స్‌పోజ్ చేసినంత తేలిక కాదు సావిత్రిగారిలా నటించడమంటే’ అని కామెంట్ చేశాడు. (netizens target on anasuya)
దానికి అనసూయ రియాక్ట్ అయింది. తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ''కరెక్ట్‌గా చెప్పారండీ. సావిత్రమ్మలా యాక్ట్ చేయడం ఎవరితరం కాదు. నేను చిన్న ట్రిబ్యూట్ ఇచ్చానంతే. అలాగే ఎక్స్‌పోజింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. శారీరకంగా మానసికంగా చాలా ప్రిపేర్ అవ్వాలి. ఏ పాత్ర చేసినా, ఏ దుస్తులు ధరించినా మన పనిని ధృడ సంకల్పంతో చేయాలి’ అంటూ ట్వీట్ చేసింది. అయినా నెటిజన్లు అనూని వదల్లేదు. కొందరు బాగా చేశారని ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. 'మీ నటన బావుంది. మిమ్మల్ని విమర్శిస్తున్న వారికి చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పారు’ అని ఓ నెటిజెన్, నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావ్ అనసూయ’ అని మరో నెటిజెన్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ సంభాషణ వైరల్‌గా మారింది.