Biggboss 7: అమర్‌ ఆట... లాగేసే.. తోసేసి... బెడ్‌ మీద పడేసి!

ABN , First Publish Date - 2023-10-12T13:15:47+05:30 IST

బిగ్‌బాస్‌సీజన్ 7 ఉల్టా - పుల్టా కాస్త జోరు మీదే సాగుతుంది. ఇప్పటికే ఐదువారాలు పూర్తి చేసుకుంది. బాగ్‌బాస్‌ ఇంటి సభ్యులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. గతవారం ఎలిమినేషన ప్రక్రియ అందుకు నిదర్శనం.

Biggboss 7: అమర్‌ ఆట... లాగేసే.. తోసేసి... బెడ్‌ మీద పడేసి!

బిగ్‌బాస్‌సీజన్ 7 ఉల్టా - పుల్టా కాస్త జోరు మీదే సాగుతుంది. ఇప్పటికే ఐదువారాలు పూర్తి చేసుకుంది. బాగ్‌బాస్‌ ఇంటి సభ్యులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. గతవారం ఎలిమినేషన ప్రక్రియ అందుకు నిదర్శనం. ఈ వారానికి నామినేషన ప్రక్రియ జరుగుతోంది. దానికి సంబంధించిన టాస్క్‌లు జోరుగా సాగుతున్నాయి. తాజా ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.

ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో అమర్‌దీప్‌కు నాగార్జున బలమైన క్లాస్‌ పీకారు. అయినా అతనిలో ఎలాంటి మార్పు లేదు. రోజురోజుకి అమర్‌దీప్‌ ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో.. అసలు బ్రెయిన వాడుతున్నాడో లేదో కూడా తెలీడం లేదు. వీక్షకులు కూడా అదే మాట అంటున్నారు. పెద్దగా గేమ్‌ ఆడకపోయినా ఆడియన్స ఓట్‌ వేసి సపోర్ట్‌ చేస్తున్నారు. అయితే ఈ వారం మాత్రం అతని ఆట కష్టమే అనిిపిస్తుంది, బిగ్‌బాన ఇంటి నుంచి పంపేస్తాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అదే మాట అమర్‌ నోట కూడా వచ్చింది. భయమేస్తోంది.. ఇంటికి పంపేస్తారేమో అంటూ మాట్లాడుతున్నాడు అయితే తాజగా టాస్క్‌ అమర్‌దీప్‌ పెర్‌ఫార్మెన్స ఆడియన్సకి చిరాకు తెప్పిస్తుంది. ుఏంట్రా వీటి ఆట.. మైండ్‌ ఉండి ఆడుతున్నాడో ముండ్‌ పోయిందా అనేలా చేస్తున్నాడు. అంత చెండాలంగా ఒక లేడీ కంటెస్టెంట్‌పై ప్రవర్తించాడు.


‘ఎవరు ఫాస్టెస్ట్‌’ అంటూ బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ ఇచ్చాడు. దీని ప్రకారం ఆటగాళ్లు- పోటుగాళ్లు రెండు జట్ల నుంచి ఒక్కో కంటెస్టెంట్‌ ముందుకు వచ్చారు. వారికి బిగ్‌బాస్‌ ఓ కలర్‌ చెప్పగానే ఆ కలర్‌ వస్తువును ఇంట్లో ఎక్కడుందో వెతికి ముందుగా ఎవరు తీసుకువస్తారో వాళ్లు విజేతలు. ఇలా మొత్తం 8 రౌండ్లు జరుగుతాయి. ప్రతి రౌండ్‌లోనూ కొత్త ఆటగాడు గేమ్‌లో పార్టిసిపేట్‌ చేయాలి. ఈ టాస్కులో ఒక రౌండ్‌లో ఆటగాళ్ల టీమ్‌ నుంచి అమర్‌.. పోటుగాళ్ల జట్టు నుంచి అశ్విని శ్రీ బరిలోకి దిగారు. బిగ్‌బాస్‌ మెరూన్‌ కలర్‌ అని చెప్పగానే ఇద్దరూ లోపలికి ఉరికారు. అమర్‌ మెరూన్‌ కలర్‌ ఏదైనా వస్తువును తాను వెతికి గుర్తించి తీసుకురావడం మానేసి అశ్విని ఏం పట్టుకుంటుందా అని గమనించాడు. ఆ అమ్మాయి ఏదో డోర్‌ మేట్‌ తీస్తుంటే వెళ్లి మీద పడిపోయి దాన్ని లాక్కొచ్చి పెట్టేశాడు. తీరా అది మెరూన్‌ కలర్‌ కాదనేసరికి మళ్లీ పరిగెత్తి అశ్విని గదిలో ఏదో వస్తువు తీసుకుంటే ఆ అమ్మాయి చేతిలో నుంచి దాన్ని లాక్కొన్నే ప్రయత్నం చేశాడు. అశ్విని ఎదురు తిరిగేసరికి ఆమె మీద పడిపోయి తోసేసి, బెడ్‌ మీద నుంచి అశ్విని కిందపడిపోతుంటే దాన్ని లాక్కొని వెళ్లిపోయాడు. అది కూడా మెరూన కాదని ఇంటి సభ్యులు అనడంతో మళ్లీ పరుగులు తీశాడు. అమర్‌ చేస్తున్న దాన్ని చూసి పోటుగాళ్లు టీమ్‌ నుంచి గౌతమ్‌ వ్యతిరేకిస్తూ గట్టిగా అరిచాడు. అశ్విని కూడా ఇది కరెక్ట్‌ కాదని చెబుతున్నా ఇదే నా గేమ్‌ అంటూ వెళ్లి మళ్లీ ఆమె మీద పడిపోయాడు. ఫైనల్‌గా అశ్విని ఏదో డ్రెస్‌ తీసి చేతిలో పెట్టుకుంటే లాగేసుకుంటాడేమోనని ఆ డ్రెస్‌ను ధరించింది. దాంతో ఆ అమ్మాయి గది నుంచి బయటకు రాకుండా తలుపు దగ్గర అడ్డుపడ్డాడు. అలా అడ్డగించకూడదని బిగ్‌బాస్‌ అమర్‌కి వార్నింగ్‌ ఇచ్చాడు. అయినా సరే కాేసపు అలానే ఉండి ఆ అమ్మాయి వేసుకున్కన డ్రెస్‌ను లాగేయబోయాడు. చివరి బిగ్‌బాస్‌ ఆ రెండు రౌండ్లు క్యాన్సిల్‌ చేశాడు. ఇంత వైలెంట్‌గా ప్రవర్తించాల్సిన అవసరం లేదంటూ చెప్పాడు. అయితే ఏదో సామెత చెప్పినట్లు అమర్‌ వేసుకున్న షర్ట్‌ కలర్‌ మెరూనే. అది గుర్తించకుండా ఆ అమ్మాయి వేసుకున్నది కూడా లాగేయబోయాడు. ఆ టాస్క్ తో  అమర్‌ ఆట ఏంటో.. అతని బుద్ధి ఏంటో తెలిసిందని నెటిజన్లు కామెంట్‌ చేశారు.

Updated Date - 2023-10-12T13:15:47+05:30 IST