Pushpa-2: పుష్పరాజ్‌ షెడ్యూల్‌.. అక్కడ ఏం జరుగుతోందంటే!

ABN , First Publish Date - 2023-04-18T10:26:36+05:30 IST

‘అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేసినాయంటే పులి వచ్చిండాదని అర్థం. (Pushpa 2) అదే పులి రెండడుగులు వెనక్కి వేసినాదంటే పుష్ప వచ్చిండాదని అర్ధం.. ఇది పుష్పగాడి రూలు’’

Pushpa-2: పుష్పరాజ్‌ షెడ్యూల్‌.. అక్కడ ఏం జరుగుతోందంటే!

‘‘అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేసినాయంటే పులి వచ్చిండాదని అర్థం. (Pushpa 2)

అదే పులి రెండడుగులు వెనక్కి వేసినాదంటే పుష్ప వచ్చిండాదని అర్ధం..

ఇది పుష్పగాడి రూలు’’

అల్లు అర్జున్‌ (allu arjun) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సర్‌ప్రైజ్‌ గ్లింప్స్‌లోని ఈ డైలాగ్‌ ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే. సినిమాలో అంతకుమించి డైలాగ్‌లు అలరిస్తాయని చిత్ర బృందం చెబుతోంది. ‘పుష్ప-1’ ప్యాన్‌ ఇండియా స్థాయిలో సాధించిన విజయంతో ‘పుష్ప-2’ను (Pushpa -2 Shoot in rfc) అంతకుమించి తెరకెక్కించాలని సుకుమార్‌ (Sukumar) ప్లాన్‌ చేశారు. అందుకే కథ మీద మరింత వర్క్‌ చేసి షూటింగ్‌ మొదలుపెట్టారు. అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ కి బన్నీ పుట్టినరోజున టీజర్‌తో ట్రీట్‌ ఇచ్చి కూల్‌ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో పుష్పరాజ్‌ సందడి చేస్తున్నాడు. భారీ పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. పుష్పరాజ్‌ శత్రువులను ఇరగదీస్తున్నారు. అల్లు అర్జున్‌, విదేశీ ఫైటర్ల నేపథ్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు సుకుమార్‌. మరో నాలుగు రోజులపాటు అక్కడే చిత్రీకరణ జరగనుందని తెలిసింది! తదుపరి అడవి నేపథ్యంలో సాగు సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. అల్లు అర్జున్‌కి దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించింది. ఈ చిత్రంతో బన్నీ ప్యాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అందుకే పుష్ప -2 మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పోరాట ఘట్టాలు సినిమాకు హైలైట్‌గా ఉంటాయని, మొదటి భాగంతో కంపేర్‌ చేస్తే ఈ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందని యూనిట్‌ చెబుతోంది. (Rashmika mandanna)

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. ఫవాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రధారులు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Updated Date - 2023-04-18T10:26:39+05:30 IST