Allu Arjun: పేరు రివీల్‌ చేశారు.. అన్నీ ఇచ్చిన దేవుడు నాన్న!

ABN , First Publish Date - 2023-05-30T14:30:29+05:30 IST

‘పుష్ప’ సక్సెస్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఆ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. తన జీవితంలో ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరనేది ఆయన రివీల్ చేశారు.

Allu Arjun: పేరు రివీల్‌ చేశారు.. అన్నీ ఇచ్చిన దేవుడు నాన్న!

'పుష్ప’(Pushpa) సక్సెస్‌తో ప్యాన్‌ ఇండియా స్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Icon star allu arjun). ప్రస్తుతం ఆ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ (Pushpa 2) చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘ఆహా’ ఓటీటీలో జరుగుతున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమానికి అల్లు అర్జున్‌ అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో శ్రుతీ నండూరి పాడిన పాటలను ఆస్వాదించిన బన్నీ ఆమె పేరుకు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధముందన్నారు. తన ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పేరు శ్రుతీ అని వెల్లడించారు. సింగర్‌ శ్రుతి పాట పాడిన అనంతరం బన్నీ మాట్లాడుతూ.. ‘నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ (allu arjun First girl Friend) పేరు కూడా శ్రుతినే’ అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.

Untitled-1.jpg

‘‘మిమ్మల్ని, మీ భార్య స్నేహాని, పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తుంది. మీ మధ్య మంచి బాండింగ్‌ ఉంది. మీ ఫ్యామిలీని చూసి చాలా నేర్చుకోవాలి’ అని సింగర్‌ గీతామాధురి అనగా, ఈ శ్రుతీ ఎపిసోడ్‌ తర్వాత కూడా బాండింగ్‌ అలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని బన్నీ చమత్కరించారు. మరి ఈ వీడియో చూసి స్నేహా ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.

అలాగే తన తండ్రి గురించి గొప్పగా మాట్లాడారు బన్నీ. ఒక్క మాటలో తన తండ్రి గురించి చెప్పాలంటే ‘నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలీదు కానీ.. నాకు కనిపిస్తూ, అన్ని ఇచ్చిన దేవుడు మా నాన్న’’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-05-30T14:52:30+05:30 IST