Allu Arjun: అల్లుడి సత్తా చూపించినా మామకి మొండిచెయ్యి చూపించారు

ABN , First Publish Date - 2023-08-21T15:26:45+05:30 IST

అల్లు అర్జున్ కొన్ని రోజుల క్రితం నల్గొండ లో సందడి చేశారు, అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. అతని మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కట్టిన కన్వెన్షల్ ప్లేస్ ఓపెన్ చెయ్యడానికి హాజరయ్యారు. అదే ఫంక్షన్ లో మామ తనకి ముఖ్యమంత్రి టికెట్ ఇస్తారన్న ఆశాభావంతో వున్నారు, మరి ఈరోజు లిస్ట్ వచ్చింది, కానీ...

Allu Arjun: అల్లుడి సత్తా చూపించినా మామకి మొండిచెయ్యి చూపించారు
Allu Arjun recently opened the Kancharla Convention Place

కొన్ని రోజుల క్రితం నటుడు అల్లు అర్జున్ (AlluArjun) నల్గొండలో (Nalgonda) హడావిడి చేశారు. తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (KancharlaChandrasekharReddy) కట్టించిన కంచర్ల కన్వెన్షన్ ప్లేస్ (KancharlaConventionPlace) ఓపెనింగ్ కి హాజరయ్యాడు అల్లు అర్జున్. అతని అభిమానుల జన సందోహంతో నల్గొండ నిండిపోయింది. దారిపొడవునా, అల్లు అర్జున్ కట్ ఔట్స్, అలాగే బీఆర్ఎస్ (BRS) నాయకుల కట్ ఔట్స్ విపరీతంగా కనిపించాయి. ఆరోజు అల్లు అర్జున్ సందడే సందడి అక్కడ. అంతమంది అభిమానులు వచ్చారు.

అదే సమావేశంలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తనకి నాగార్జున సాగర్ (NagarjunaSagar) నుండి ముఖ్యమంత్రి కెసిఆర్ (KCR) పోటీ చెయ్యమంటే తప్పకుండా చేస్తాను అని అన్నారు. లేదా వేరే దగ్గర టికెట్ ఇచ్చినా పోటీ చేస్తాను అని చెప్పారు. అతను టికెట్ ఆశిస్తున్న వారిలో వున్నారు అని అర్థం అయింది. అందుకే ముఖ్యమంత్రి లిస్ట్ ప్రకటించక ముందే తన కన్వెన్షన్ ప్లేస్ ని అల్లుడు అల్లు అర్జున్ చేత ఓపెన్ చేయించి తన వెనకాల తన అల్లుడు, అతని అభిమానులు వున్నారు అని పరోక్షంగా చెప్పకనే చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి.

alluarjun-nalgonda3.jpg

అయితే ఈరోజు ముఖ్యమంత్రి కెసిఆర్ #KCRannouncedBRSlist బీఆర్ఎస్ పార్టీ లిస్ట్ ప్రకటించారు. అందులో ఎక్కడా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు లేదు. అయితే నాగార్జున సాగర్ నుండి ఇస్తే పోటీ చేస్తాను అని చెప్పిన చంద్రశేఖర్ రెడ్డి కి అక్కడ కూడా చుక్కెదురైంది. అక్కడ నోముల భగత్ (NomulaBhagath) పేరు వచ్చింది. అల్లు అర్జున్ మామకి ఈసారి పార్టీ తరపున పోటీ చేసే అవకాశం లేనట్టే అనిపిస్తోంది. మరి ఇప్పుడు అల్లు అర్జున్ మామ ఏమి చేస్తారో, తన తదుపరి ఎత్తు ఏమిటో, ఎటువంటి ఆలోచన చేస్తారో చూడాలి మరి.

Updated Date - 2023-08-21T15:26:45+05:30 IST