Allu Arjun: మెగా ఫ్యామిలీ గురించి క్లారిటీ ఇచ్చేశాడు.

ABN , First Publish Date - 2023-07-20T23:20:16+05:30 IST

‘‘చిరంజీవిగారికి ‘బేబీ’ చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ వీరాభిమాని. సోషల్‌ మీడియాలో చిరంజీవిపై ఎవరన్నా కామెంట్‌ చేస్తే ఘాటుగా సమాధానం ఇచ్చేవాడు. అది గమనించిన అల్లు శిరీష్‌ ఏలూరులో ఉన్న ఎస్‌.కె.ఎన్‌ను తమ దగ్గరకురమ్మని పిలిపించాడు. అలా ఎస్‌కెఎన్‌ మా ఫ్యామిలీలో భాగమయ్యాడుఅంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అల్లు అర్జున్‌. అలా అంటూనే చిరంజీవి మీదున్న అభిమానాన్ని చాటారు బన్నీ. ‘కట్టే కాలే వరకు నేను చిరంజీవి అభిమానినే.. అది ఎప్పటికీ మారదు’’ అని అల్లు అర్జున్‌ అన్నారు.

Allu Arjun: మెగా ఫ్యామిలీ గురించి క్లారిటీ ఇచ్చేశాడు.

‘‘చిరంజీవిగారికి (Chiranjeevi) ‘బేబీ’ (Baby) చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ (SKN) వీరాభిమాని. సోషల్‌ మీడియాలో చిరంజీవిపై ఎవరన్నా కామెంట్‌ చేస్తే ఘాటుగా సమాధానం ఇచ్చేవాడు. అది గమనించిన అల్లు శిరీష్‌ ఏలూరులో ఉన్న ఎస్‌.కె.ఎన్‌ను తమ దగ్గరకురమ్మని పిలిపించాడు. అలా ఎస్‌కెఎన్‌ మా ఫ్యామిలీలో భాగమయ్యాడుఅంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అల్లు అర్జున్‌. అలా అంటూనే చిరంజీవి మీదున్న అభిమానాన్ని చాటారు బన్నీ. ‘కట్టే కాలే వరకు నేను చిరంజీవి అభిమానినే.. అది ఎప్పటికీ మారదు’’ అని అల్లు అర్జున్‌ అన్నారు. చాలాకాలంగా అల్లు ఫ్యామిలీకీ, చిరు ఫ్యామిలీకి మఽధ్య విభేధాలున్నాయని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు ఓ క్లారిటీ ఇచ్చినట్లుగా ఉంది. ప్రస్తుతం బన్ని మాటలు నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘బేబి’ సినిమా సక్సెస్‌ మీట్‌కు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. (allu Arjun Fan of Chiranjeevi)

ప్రేమలో బాధను చెప్పే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమానే బేబి. నాకు ఈ సినిమా చాలా నచ్చింది. కథ రాసిన విధానం, తీసిన తీరు.. ఇలా ప్రతిదీ ఆకట్టుకున్నాయి. దర్శకుడు సాయి రాజేశ్‌ అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాల్లోకి వచ్చాక ఆయన జర్నీ నాకు తెలుసు. ఆయన కథ చెబుతానంటే వినేందుకు టైమ్‌వేస్ట్‌ అని అనుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి ఆయన ‘బేబీ’ చిత్రంతో ఇంత పెద్ద విజయం అందుకోవడం ఆనందంగా ఉంది. ఎవరిలో ఏ ప్రతిభ ఉంటుందో, అది ఎలా బయటకొస్తుందో ఎవరికీ తెలియదు. చిన్న సినిమాలు చూడడం లేదని చాలామంది అంటుంటారు. సినిమా బావుంటే చిన్న, పెద్ద అనే తేడా ఉండదు. ఇక నిర్మాత ఎస్‌కెఎన్‌ చిరంజీవిగారి అభిమానిగా వచ్చి, జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా పని చేసి నిర్మాతగా ఎదిగాడు. మూడేళ్ల నుంచి కలిసినప్పుడల్లా ఏం చేస్తున్నావని అడిగితే ‘బేబీ అనే సినిమా తీస్తున్నా బాస్‌’ అనేవాడు. అదేమన్నా ‘బాహుబలి’నా ఇన్నేళ్లు తీస్తున్నారంటూ జోక్స్‌ వేేసవాణ్ని. తను మాత్రం ‘ఇది కల్ట్‌ సినిమా బాస్‌’ అని ఎప్పుడూ నమ్మకంగా చెబుతుండేవాడు’’ అని అన్నారు.

తెలుగు సినిమా తగ్గేదేలే...

‘‘నేను ఈ ఈవెంట్‌కి రావడానికి ప్రధాన కారణం తెలుగమ్మాయి వైష్ణవి.. తెలుగమ్మాయిలు సినిమాల్లో నటించట్లేదని బాధ కలుగుతుండేది. తను ‘అల వైకుంఠపురములో’ సినిమాలో వైష్ణవి నా సిస్టర్‌గా నటించింది. అప్పట్లో నేను అంతగా పట్టించుకోలేదు. బాగానే నటిస్తుందనుకునేవాణ్ని తప్ప పెద్దగా మాట్లాడలేదు. ‘ఇలాంటి అమ్మాయి కీలక పాత్రలో సినిమా తీసే రోజు ఎప్పుడొస్తుందో?’ అని అనుకున్నానంతే. అలాంటిది ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమా వేడుకలో మాట్లాడడం సంతోషంగా ఉంది. తను ఉత్తమ నటి అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నా. మరోవైపు శ్రీలీల కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. ఇకపై తెలుగమ్మాయిలే తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించాలని కోరుకుంటున్నా. మీరు ధైర్యంగా రండి.. నేను ఆహ్వానిస్తున్నా. తెలుగు సినిమా తగ్గేదేలే’’ అని బన్నీ అన్నారు.

Updated Date - 2023-07-20T23:23:12+05:30 IST