Allu Arjun: ‘నువ్వు వైర్‌ కాదు డార్లింగ్‌... ఫైర్‌’ అన్నాడు

ABN , First Publish Date - 2023-08-27T10:49:28+05:30 IST

69 ఏళ్ల జాతీయ పురస్కారాల చరిత్రలో ఎవరికీ సాఽధ్యం కానిది నాతో సాధ్యమైందని, ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తొలి నటుడిని నేనే అని తెలిసి ఎంత ఆనందించానో అంతే షాక్‌కి గురయ్యా. ఇదివరకు వచ్చిందేమో, నేను మూడోవాణ్నో, నాలుగోవాణ్నో అనుకున్నా. కానీ టీవీలో నాకే తొలిసారి అని తెలిశాక ఆశ్చర్యపోయా. నేనేదో మిగతా వాళ్లకంటే గొప్ప అని కాదు. గొప్ప గొప్ప నటులున్నా ఎందుకో కుదరలేదు. ఆ పరిస్థితులు, ఆ సమయం ఎలాంటిదో తెలియదు కదా’’ అని ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అన్నారు.

Allu Arjun: ‘నువ్వు వైర్‌ కాదు డార్లింగ్‌... ఫైర్‌’ అన్నాడు

"69 ఏళ్ల జాతీయ పురస్కారాల చరిత్రలో ఎవరికీ సాధ్యం కానిది నాతో సాధ్యమైందని, ఉత్తమ నటుడిగా జాతీయ (National award) పురస్కారం అందుకున్న తొలి నటుడిని నేనే అని తెలిసి ఎంత ఆనందించానో అంతే షాక్‌కి గురయ్యా. ఇదివరకు వచ్చిందేమో, నేను మూడోవాణ్నో, నాలుగోవాణ్నో అనుకున్నా. కానీ టీవీలో నాకే తొలిసారి అని తెలిశాక ఆశ్చర్యపోయా. నేనేదో మిగతా వాళ్లకంటే గొప్ప అని కాదు. గొప్ప గొప్ప నటులున్నా ఎందుకో కుదరలేదు. ఆ పరిస్థితులు, ఆ సమయం ఎలాంటిదో తెలియదు కదా’’ అని ఐకాన్‌ స్టార్‌ అల్లు (icon Star Allu arjun) అర్జున్‌ అన్నారు. తాజాగా ప్రకటించిన నేషనల్‌ అవార్డ్స్‌లో ఆయన ఉత్తమ నటుడిగా అవార్డు గెలుపొందిన సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా బన్నీ చెప్పుకొచ్చిన సంగతులు...

నేషనల్‌ అవార్డ్స్‌ ప్రకటనకు ముందే సోషల్‌ మీడియాలో మీ పేరు వినిపించింది. అడ్వాన్స్‌గా శుభాకాంక్షలే వెల్లువెత్తాయి. అభిమానుల్లో ఆ హుషారు చూసి మీకు ఎలా అనిపించింది?

ఫ్యాన్స్‌, సగటు సినీ ప్రేమికుల్లో కానీ... అంత నమ్మకం ఉండటానికి కారణం ఒక్కటే. ఆ ఏడాదికి సంబంధించి చాలా పురస్కారాల్లో మేమే ముందున్నాం. సినిమాకి అత్యధికవసూళ్లు వచ్చాయి. నటన పెద్ద పాత్ర పోషించింది. అలా ఏ రకంగా చూసినా మాకు అవకాశాలు ఎక్కువే. అదే సమయంలో నాకు రాకపోవచ్చనే సందేహం కూడా ఉండేది. సినిమా అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది. పుష్ప పాత్ర కూడా ఓ స్మగ్లర్‌. అలా కొన్నిసార్లు సినిమా నేపథ్యం కూడా సహకరించకపోవచ్చు. అందుకే ఏమైనా జరగొచ్చు అనుకున్నా. వచ్చే అవకాశం ఉందని బలంగా నమ్మాను.

అవార్డ్‌ గెలుచుకుంది బన్నీనే అని తెలిసిన తర్వాత ఎలా అనిపించింది?

చాలా విభాగాల్లో మా సినిమాకు నామినేషన్లు వేశాం. ఎవరెవరికి పురస్కారం వస్తుందో అనే ఎగ్జైట్‌మెంట్‌ బాగా ఉండేది. అందుకే దర్శకుడు, నిర్మాతలు అందరూ ఒకే చోట టీవీ ముందు కూర్చున్నాం. ఉత్తమ నటుడు విభాగంలో నా పేరు తెరపై కనిపించగానే ఆనందంతో సుకుమార్‌ని గట్టిగా హత్తుకున్నా. ఈ అవార్డు నాకు దక్కడానికి వంద కారణాలు ఉంటే, అవన్నీ సుకుమార్‌కే ఇస్త్తా. ఉత్తమ నటుడు పురస్కారం నాకు రావాలని నా కంటే వంద రెట్లు ఎక్కువ తను కోరుకున్నాడు. ఇది నా పురస్కారం కంటే తనకి వచ్చిన పురస్కారం అనుకోవాలి. నేను కేవలం మాఽధ్యమంలా పనిచేశా. నేనొక వైర్‌ అయితే అందులో కరెంట్‌ నువ్వే అని తనతో చెప్పా. ‘నువ్వు వైర్‌ కాదు డార్లింగ్‌... ఫైర్‌’ అన్నాడు సుకుమార్‌.

6.jpgచిరంజీవిని కలిశారు.. ఆయన స్పందన ఏంటి?

‘ఒక నటుడికి ఉత్తమ నటుడు పురస్కారం ఎందుకు ఇవ్వాలో ఓ లిస్ట్‌ వేేస్త... అందులోని అన్ని బాక్సుల్లో నీ చెక్‌లిస్ట్‌ పడుతుంది. నువ్వు చేసిన పనికి నీకు పురస్కారం రాకపోతేనే తప్పయిపోయేది’ అన్నారు. గెటప్‌ మొదలుకొని హావభావాల, మాట్లాడిన యాస, కష్టమైన లొకేషన్లలో చిత్రీకరణ చేయడం వరకు అన్ని విషయాల్నీ గుర్తు చేసి మెచ్చుకున్నారు. ఒక కమర్షియల్‌ సినిమాలో ఇంత నటన తీసుకు రావడం కష్టమని చెప్పారు. ఆ మాటలు మరింత ఆనందాన్నిచ్చాయి. నా అభిమానులు, సగటు సినీ ప్రేక్షకులు, నేనంటే ఇష్టపడేవాళ్లు, ఇష్టపడనివాళ్లూ.. .ఇలా అందరిలోనూ ఈ పురస్కారం తర్వాత నాకు కనిపించిన కామన్‌ విషయం ఏమిటంటే.. అందరూ గర్వపడుతున్నారు. బన్నీ సాధించాడని ప్రత్యేకమైన గౌరవం, ప్రేమని ప్రదర్శిస్తున్నారు.

స్మగ్లర్‌ పాత్రకి పురస్కారమా అన్న కామెంట్స్‌ కూడా వినిపించాయి. విన్నారా?

బెస్ట్‌ యాక్టర్‌ అవార్డ్‌ అనేది నటన ప్రామాణికంగా ఇస్తారని నా అభిప్రాయం. ఆస్కార్‌ పురస్కారా?కి ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యం ఉంది. అక్కడ కూడా నటనే ప్రామాణికం తప్ప, పాత్ర కాదు. పుష్ప పాత్ర స్మగ్లరే కావొచ్చు, కానీ అందులో నటననే చూడాలి. ఉత్తమ చిత్రం విభాగానికి నామినేషన్‌ వేయొద్దని మా బృందానికి చెప్పా. ‘అగ్నిపథ్‌’ సినిమాలో అమితాబ్‌ డాన్‌ తరహా పాత్రనే పోషించారు. ఆ సినిమాకిగానూ ఆయన ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. ఈ కథ విన్నప్పుడు పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్‌ చేస్తే బిజినెస్‌ పరంగానూ, అటు అవార్డుల పరంగానూ రెండు వైపులా కొట్టొచ్చని వంద శాతం నమ్మా. అది సుకుమార్‌ పనితీరులో తెలుస్తుంది. దేవిశ్రీప్రసాద్‌కీ అవార్డు రావడం చాలా ఆనందాన్నిచ్చింది. మరిన్ని విభాగాల్లో అవార్డులు రావడానికి అర్హత ఉన్న సినిమా పుష్ప.

3.jpg

గంగోత్రి సమయంలో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడి స్థాయికి ఎదిగారు. ఈ జర్నీ గురించ ఏం చెబుతారు.

సినిమా సినిమాకు నా ఎదుగుదల చూస్తే ప్రతి ఒక్కరూ నన్ను ఇష్టపడుతున్నారు. ఆ తర్వాత నా డ్యాన్స్‌, నా ఫైట్లు, పాటలు. తొలి సినిమా నుంచీ నేను ఆలోచించేదంతా మరింత ఉత్తమంగా పనిచేయడం గురించే. ఇది చాలు అని కాకుండా... ఇది కాదు అనుకుంటూనే ప్రయాణం చేస్తా. ఈ పురస్కారం రాకపోయినా సరే, తర్వాత సినిమాకి బెటర్‌మెంట్‌ కోసం ఏమేం చేయాలో అది చేస్తా. అవార్డు వచ్చినా రాకపోయినా బాధ్యత మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అభిమానులే నా బలం. ఇంత దూరం వచ్చానంటే వాళ్లే కారణం. వాళ్ల సంతృప్తి కోసమే ఇంకా పైకి ఎదగాలనే తపన పెరిగింది. బాలీవుడ్‌లో తప్పక సినిమాలు చేస్తా. నా లక్ష్యం ఏంటంటే.. ‘ఇది కాదు, ఇంకా ఇంకా... అంతే! (నవ్వుతూ).

‘పుష్ప: ది రూల్‌’ ఎలా ఉంటుంది? తదుపరి చిత్రాలు?

అస్సలు తగ్గేదేలే.. అనే స్థాయిలో చేస్తున్నాం. సందీప్‌ రెడ్డి వంగా, త్రివిక్రమ్‌ రెండు మూడు ఆలోచనలు పంచుకున్నారు. అవి కొలిక్కి వచ్చాక చెబుతా.

Updated Date - 2023-08-27T10:52:16+05:30 IST